
ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం త్వరలో జరగనుంది. కాగా ఇప్పటికే రీటైన్ చేసుకునే జాబితాను ఆయా జట్లు ప్రకటించాయి. చాలా మంది స్టార్ ఆటగాళ్లను ప్రాంఛైజీలు రీటైన్ చేసుకోలేదు. సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు రషీద్ ఖాన్‌ని విడిచి పెట్టింది. దీంతో వీరిద్దరికీ రానున్న మెగా వేలం భారీ ధర పలకడం ఖాయం. అయితే వార్నర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కోడుతుంది.
రానున్న సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు డేవిడ్ భాయ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడన్నదే ఆ వార్త సారాంశం. అంతేకాకుండా ఆర్‌సీబీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం.కాగా ఐపీఎల్-2021 సీజన్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెప్టెన్‌గా ఎవరు ఉండనున్నరన్నది అందరి మెదడులను తొలుస్తున్న ప్రశ్న. కాగా ఐపీఎల్-2022 సీజన్‌కు గాను ఆర్సీబీ.. విరాట్ కోహ్లి, గ్లేన్ మ్యాక్స్‌వెల్, సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది.
చదవండి: Chakda Xpress: జూలన్ గోస్వామిగా అనుష్క శర్మ.. చక్దా ఎక్స్‌ప్రెస్ టీజర్ రిలీజ్
Comments
Please login to add a commentAdd a comment