
Courtesy: IPL Twitter
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వార్నర్.. తన భార్య, ముగ్గురు కూతుళ్లను సోషల్ మీడియాకు ఎప్పుడో పరిచయం చేశాడు. కుటుంబమంతా కలిసి ఎన్నో డాన్స్ వీడియోలు, సినిమా డైలాగులు చెప్పిన వీడియోలను షేర్ చేసుకున్నాడు.
తాజాగా ఐపీఎల్ 2022లో బిజీగా ఉన్న వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటోలో వార్నర్ ఇద్దరు కూతుర్లు ఇవీ మే, ఇండీ రేలు ఎమోషనల్ అయినట్లు కనిపించింది. ఇదంతా ఆర్‌సీబీతో మ్యాచ్‌లో వార్నర్ ఔటయ్యాకా జరిగిన విషయం. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 66 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను వార్నర్ తన ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. లీగ్‌లో వరుసగా రెండో అర్థసెంచరీ సాధించిన వార్నర్ తాను ఫామ్‌లోకి వచ్చేసినట్లే అని ప్రత్యర్థులకు సంకేతాలు పంపాడు.
అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. కాగా వార్నర్ ఔటను అతని కూతుర్లు దిగమింగుకోలేకపోయారు. ముఖ్యంగా వార్నర్ పెద్ద కూతురు ఇవీ మే నాన్న ఔటయ్యాడని గుక్కపట్టి ఏడ్వగా.. ఇండీ రే మాత్రం మనుసులోనే బాధపడింది. వార్నర్‌కి ఇది బాధ కలిగించినా ఒక విషయంలో మాత్రం సంతోషంగా అనిపించిందంటూ రాసుకొచ్చాడు.
''నా ఇద్దరు కూతుర్లకు ఆట అంటే ఏంటో అర్థమవుతుంది.నేను ఔట్ అయ్యానన్న విషయాన్ని జీర్ణించుకోలేక బాగా ఫీల్ అయ్యారు. ఇలాంటి కూతుర్లు ఉండడం నా అదృష్టం. చిన్నప్పటి నుంచే వాళ్లు ఆట గురించి తెలుసుకుంటున్నారు. ఇక ప్రతీసారి మనమే గెలవాలని రాసి పెట్టి ఉండదు. మైదానంలో అడుగుపెట్టేముందు మ్యాచ్‌లో వంద శాతం ఎఫర్ట్ చూపించాలని అనుకుంటాం. ఒకసారి కలిసొస్తుంది.. ఇంకోసారి బెడిసికొడుతుంది. ఈ విషయాన్ని నా ఇద్దరు కూతుర్లకు అర్థమయ్యేలా చెప్పాలి'' అంటూ ముగించాడు.
చదవండి: Dinesh Karthik:'వయసుతో పనేంటి.. టి20 వరల్డ్‌కప్‌లో మంచి ఫినిషర్ అవడం ఖాయం'
Comments
Please login to add a commentAdd a comment