
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కా�...
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2 మెయిన్స్ ప�...
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫై...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్�...
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్�...
నల్లగొండ: ఎస్ఎల్బీసీ పనుల్లో శనివారం...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్త...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాల�...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రిత�...
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మ...
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమ�...
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర�...
Published Sat, Apr 16 2022 7:09 PM | Last Updated on Sat, Apr 16 2022 11:30 PM
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ లైవ్ అప్డేట్స్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పంత్ 34 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ 3, మహ్మద్ సిరాజ్ 2, హసరంగా ఒక వికెట్ తీశాడు.
ఆర్సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. 17 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఢిల్లీ గెలవాలంటే 10 బంతుల్లో 34 పరుగులు చేయాలి
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యచేధనలో తడబడుతుంది. హాజిల్‌వుడ్ తాను వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. ముందుగా రోవ్‌మెన్ పావెల్‌ను డకౌట్ చేసిన హాజిల్‌వుడ్.. ఓవర్ ఆఖరి బంతికి లలిత్ యాదవ్(1)ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.
డేవిడ్ వార్నర్ 66 పరుగులు చేసి హసరంగా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 38 బంతుల్లో 66 పరుగులు చేసిన వార్నర్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.
16 పరుగులు చేసిన పృథ్వీ షా సిరాజ్ బౌలింగ్‌లో అనూజ్ రావత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 27, పృథ్వీ షా 16 పరుగులతో ఆడుతున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. షాబాజ్ అహ్మద్ 32 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు గ్లెన్ మ్యాక్స్‌వెల్ 55 పరుగులతో మెరిశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, అక్షర్‌పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.
18 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ 52, షాబాజ్ అహ్మద్ 21 పరుగులతో ఆడుతున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కష్టాల్లో పడింది. 55 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
9 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ 47, ప్రభుదేశాయ్ 2 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 12 పరుగులు చేసిన కోహ్లి లేని పరుగు కోసం యత్నించి అనవసరంగా రనౌట్ అయ్యాడు. లలిత్ యాదవ్ స్టన్నింగ్ త్రోకు కోహ్లి వెనుదిరగాల్సి వచ్చింది.
డుప్లెసిస్(8) రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. కోహ్లి 11 , మ్యాక్స్‌వెల్ 10 పరుగులతో ఆడుతున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అనూజ్ రావత్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్లో డీసీ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, మరో రెండిటిలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో (4 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో ఉండగా, ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 2 అపజయాలతో ఆరో స్థానంలో (6 పాయింట్లు) కొనసాగుతుంది.
ఇరు జట్లు ఇప్పటివరకు 27సార్లు తలపడగా.. ఆర్సీబీ 16, ఢిల్లీ 10 సార్లు విజయాలు నమోదు చేశాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. గత సీజన్లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరులో రెండు సార్లు ఆర్సీబీనే విజయం వరించింది.
Comments
Please login to add a commentAdd a comment