ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంటరైన లక్నో సూపర్‌జెయింట్స్ మెగావేలంలో కొందరు నిఖార్సైన ఆటగాళ్లను దక్కించుకుంది. కేఎల్ రాహుల్‌తోపాటు స్టోయినిస్, రవి బిష్ణోయిలను రిటైన్ చేసుకున్న లక్నో ఫ్రాంచైజీ ఆవేశ్ ఖాన్‌కు రూ. 10 కోట్లు పెట్టింది. విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను రూ. 8.75 కోట్లకు, కృనాల్ పాండ్యాను రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. వీరితో పాటు మార్క్‌వుడ్, డికాక్, దీపక్ హుడాలకు మంచి ధరే పలికింది. జట్టులో మొత్తం 21 మంది ఆటగాళ్లు కాగా.. 14 మంది భారత క్రికెటర్లు ఉంటే.. మిగతా ఏడుగురు విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరి కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ. 90 కోట్లు ఖర్చు చేసింది. ఇక లక్నో సూపర్‌జెయింట్స్ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం..
లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు..
కేఎల్ రాహుల్(కెప్టెన్): రూ. 17 కోట్లు
స్టోయినిస్ : రూ. 9 కోట్ల 20 లక్షలు
అవేశ్ ఖాన్ : రూ. 10 కోట్లు
హోల్డర్ : రూ. 8 కోట్ల 75 లక్షలు
కృనాల్ పాండ్యా : రూ. 8 కోట్ల 25 లక్షలు
మార్క్ వుడ్ : రూ. 7 కోట్ల 50 లక్షలు
డికాక్ : రూ. 6 కోట్ల 75 లక్షలు
దీపక్ హుడా : రూ. 5 కోట్ల 75 లక్షలు
మనీశ్ పాండే: రూ. 4 కోట్ల 60 లక్షలు
రవి బిష్ణోయ్ : రూ. 4 కోట్లు
ఎవిన్ లూయిస్: రూ. 2 కోట్లు
దుశ్మంత చమీర: : రూ. 2 కోట్లు
కృష్ణప్ప గౌతమ్: రూ. 90 లక్షలు
అంకిత్ రాజ్‌పుత్: రూ. 50 లక్షలు
షాబాజ్ నదీమ్: రూ. 50 లక్షలు
కైల్ మేయర్స్: రూ. 50 లక్షలు
మోసిన్‌ఖాన్ : రూ. 20 లక్షలు
ఆయుశ్ బదోని: రూ. 20 లక్షలు
కరణ్ సన్నీ శర్మ: రూ. 20 లక్షలు
మయాంక్ యాదవ్ రూ. 20 లక్షలు
మనన్ వోహ్రా: రూ. 20 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment