
ఐపీఎల్-2022లో అహ్మదాబాద్, లక్నో రెండు కొత్త జట్లుగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్నో ఫ్రాంచైజీ తమ జట్టుకు లక్నో సూపర్‌జెయింట్స్ పేరు పెట్టగా, మరో ఫ్రాంచైజీ అహ్మదాబాద్ తమ జట్టుకు పేరును ఖరారు చేసింది. తమ టీమ్ పేరు ‘గుజరాత్ టైటాన్స్’అని యాజమాన్యం అధికారికంగా బుధవారం ప్రకటించింది. అహ్మదాబాద్ జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించగా, ఈ జట్టులో రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌ను కూడా చేర్చుకుంది. ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్‌స్టన్‌లు కోచింగ్ సిబ్బందిలో చేరారు. కాగా భారత్- వెస్టిండీస్ రెండో వన్డే ముందు ప్రీ-మ్యాచ్ షోలో పాల్గోన్న హార్దిక్ పాండ్యా కూడా తమ జట్టు పేరు గుజరాత్ టైటాన్స్ అని వెల్లడించాడు.
అదే విధంగా గుజరాత్ టైటాన్స్ అధికారిక లోగోను కూడా త్వరలో షేర్ చేయనున్నట్లు పాండ్యా పేర్కొన్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ట్విటర్‌లో'శుభ్ ఆరంభ్' అని పోస్ట్ చేశారు. గతంలో గుజరాత్ లయన్స్ ఐపీఎల్ -2015 సీజన్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్ మెగా వేలానికి ముందు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యా (15), రషీద్ ఖాన్(15), శుభ్‌మన్ గిల్(8) కోట్లకు కోనుగొలు చేసింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు.