IPL 2022 Auction Day-2:హైదరాబాద్ క్రికెటర్, యువ భారత జట్టు సభ్యుడు తిలక్ వర్మపై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్ మెగా వేలం-2022లో అతడు మంచి ధర పలికాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసింది. 1.70 కోట్ల రూపాయలు వెచ్చించి తిలక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ హైదరాబాదీ పంట పండినట్లయింది.
కాగా ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీలో తిలక్ వర్మ 180 పరుగులు చేశాడు. అదే విధంగా.. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ జట్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 13 నాటి రెండో రోజు వేలంలో ముంబై.. సన్‌రైజర్స్‌తో పోటీ పడి 19 ఏళ్ల తిలక్‌ను దక్కించుకుంది. ఇక అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్ కంటే కూడా తిలక్ వర్మ మూడు రెట్లు ఎక్కువ ధర పలకడం విశేషం. యశ్ ధుల్‌ను ఢిల్లీ 50 లక్షలకు కొనుగోలు చేసింది.
చదవండి: IPL 2022 Auction: ఏడాదిలో తలకిందులు.. అప్పుడు 9.25 కోట్లు... ఇప్పుడు కేవలం!
N Tilak Varma is SOLD to @mipaltan for INR 1.70 Crore#TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 13, 2022
Comments
Please login to add a commentAdd a comment