ఎవరీ షెప‌ర్డ్.. 7.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం! | Who is Romario Shepherd? SRHs 7 75 Crore recruit | Sakshi
Sakshi News home page

IPL 2022 Mega Auction: ఎవరీ షెప‌ర్డ్.. 7.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం!

Feb 13 2022 6:54 PM | Updated on Feb 13 2022 9:55 PM

Who is Romario Shepherd? SRHs 7 75 Crore recruit - Sakshi

ఐపీఎల్ మెగా వేలం-2022లో  వెస్టిండీస్ ఆల్ రౌండ‌ర్‌లు ద‌మ్ము రేపుతున్నారు. ఓడియన్ స్మిత్‌ను పంజాబ్ కొనుగోలు చేయ‌గా, మ‌రో ఆల్ రౌండ‌ర్  రొమారియో షెపర్డ్‌ను రూ. 7.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ద‌క్కించుకుంది. వేలంలో రూ.75 ల‌క్ష‌ల బెస్ ప్రైస్‌తో వ‌చ్చిన షెపర్డ్ కోసం ల‌క్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్,  రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ పోటీ ప‌డ్డాయి.

చివ‌ర‌కు హైదరాబాద్ కైవ‌సం చేసుకుంది. షెప‌ర్డ్ 2019 లో వెస్టిండీస్ త‌రుపున అరంగేట్రం చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు,14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా గ‌త కొద్ది కాలంగా టీ20 ల్లో బ్యాట్‌తో, బాల్‌తో షెపర్డ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20ల్లో 44 మ్యాచ్‌లు ఆడిన షెపర్డ్ 53 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లోనూ షెపర్డ్ రాణించాడు. 

చ‌ద‌వండి: IPL 2022 Mega Auction: టీమిండియాపై అద‌ర‌గొట్టాడు.. వేలంలో జాక్ పాట్‌!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement