అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. అయితే భారత్ విజయంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. తన 10 ఓవర్ల కోటాలో 3 మెయిడెన్లుతో సహ 12 పరుగులు ఇచ్చి ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తన అద్భుతమైన లైన్ లెంగ్త్ డిలెవరీలతో విండీస్ బ్యాటర్‌లను ముప్పు తిప్పలు పెట్టాడు.
ఈ మ్యాచ్‌లో బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, పూరన్, రోచ్ వికెట్‌లను కృష్ట సాధించాడు. కాగా భారత్ తరుపున వన్డేల్లో తక్కువ పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్‌గా ప్రసిద్ధ్ నిలిచాడు. అంతకు ముందు బంగ్లాదేశ్‌పై స్టువర్ట్ బిన్నీ 4 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు ఇది ఇలా ఉంటే.. త్వరలో జరగనున్న ఐపీఎల్-2022 మెగా వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ప్రసిద్ధ్ కృష్ణ ఆకర్షించే అవకాశం ఉంది. రానున్న వేలంలో ప్రసిద్ధ్‌కి భారీ ధర దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది.
చదవండి: IND vs WI: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Comments
Please login to add a commentAdd a comment