ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం ఆసన్నమైంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీలలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ చకచక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను కూడా ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. అంతేకాకుండా ఈ క్యాష్ రీచ్ లీగ్‌లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో, అహ్మదాబాద్ సైతం తాము ఎంచుకున్న ముగ్గురు ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. దీంతో రషీద్‌ని అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో రషీద్ స్ధానాన్ని భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌తో భర్తీ చేయాలని సన్‌రైజర్స్ యాజమాన్యం భావిస్తోన్నట్లు సమాచారం.
ఇప్పటికే చహల్‌తో సన్‌రైజర్స్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు ఆర్సీబీ చహల్‌ను రీటైన్ చేసుకోలేదు. అయితే గత కొన్నాళ్లుగా ఆర్సీబీకి ఆడిన చహల్ రూ. 6 కోట్ల వేతనం అందుకున్నాడు. ఈ క్రమంలో ఈ సారి వేలంలో తన కనీస ధరను రూ. 2 కోట్లగా చహల్ రిజిస్టర్ చేసుకున్నాడు. అతడిని దక్కించుకోవడానికి చాలా జట్లు పోటీ పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న వేలంలో చహల్ 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే చహల్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సన్‌రైజర్స్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Ipl 2022 mega auction: వేలంలో అతడు రికార్డు ధర బద్దలు కొట్టడం ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment