Breadcrumb
- HOME
IPL 2022 Mega Auction Day 2: రెండో రోజు వేలం.. లైవ్ అప్డేట్స్
Published Sun, Feb 13 2022 10:40 AM | Last Updated on Sun, Feb 13 2022 12:53 PM
Live Updates
ఐపీఎల్ మెగా వేలం- 2022 అప్డేట్స్
ముగిసిన ఐపీఎల్-2022 మెగా వేలం.. 204 మంది ఆటగాళ్లు!
ఐపీఎల్-2022 మెగా వేలం దిగ్విజయంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఫ్రాంచైజీలు రూ.550 కోట్లు పైగా వెచ్చించాయి. ఐపీఎల్-2022 మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ (రూ.15.25 కోట్లు) రికార్డు సృష్టించాడు. రూ. 15.25 కోట్లకు కిషన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కిషన్ తర్వాత దీపక్ చాహర్(14 కోట్లు) అత్యధిక ధర దక్కింది. ఇక తొలి రోజు వేలంలో 74 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా, రెండో రోజు 130 మంది ఆటగాళ్లు అమ్ముడు పోయారు. 11 మంది ఆటగాళ్లు రూ. 10 కోట్లు పైగా దక్కించుకున్నారు. కాగా ఈ వేలంలో సురేష్ రైనా వంటి స్టార్ ఆటగాళ్లు చాలా మంది అమ్ముడు పోలేదు. ఇక ఆన్క్యాప్డ్ ఆటగాళ్లు షారుఖ్ ఖాన్(రూ.9 కోట్లు), అవేష్ ఖాన్(ర.10 కోట్లు)లకు భారీ ధర దక్కింది
గ్లెన్ ఫిలిప్స్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్
న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
క్రిస్ జోర్డాన్‌ను సొంతం చేసుకున్న చెన్నై
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను రూ. 3.60 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
అలెక్స్ హేల్స్‌ను దక్కించుకున్న కేకేఆర్
ఇంగ్లండ్ బ్యాటర్ అలెక్స్ హేల్స్‌ను రూ.1.50 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది
టిమ్ సౌథీను దక్కించుకున్న కేకేఆర్
న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీను రూ. 1.50 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది
ఇంద్రజిత్‌ను దక్కించుకున్న కేకేఆర్
తమిళనాడు ఆల్‌రౌండర్ బాబా ఇంద్రజిత్‌ను కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
ముంబై ఇండియన్స్‌కు మెరెడిత్.. ధర ఎంతంటే
ఆస్ట్రేలియా పేసర్ రిలే మెరెడిత్‌ను రూ.1 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
కరుణరత్నేను దక్కించుకున్న కేకేఆర్
శ్రీలంక ఆల్ రౌండర్ చమికా కరుణరత్నేను రూ.50 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
ప్రశాంత్ సోలంకిను దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్
ఇండియా బౌలర్ ప్రశాంత్ సోలంకిను రూ.1.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
మోషిన్ ఖాన్‌ను దక్కించుకున్న లక్నో
ఉత్తరప్రదేశ్ ఆల్ రౌండర్ మోషిన్ ఖాన్‌ను రూ.20 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
టిమ్ డేవిడ్‌కు రికార్డు ధర
సింగపూర్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌కు జాక్‌పాట్ తగిలింది. రూ. 40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకుంది. అతని కోసం కేకేఆర్, ముంబై ఇండియన్స్ పోటీపడ్డాయి. చివరకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
రాజస్తాన్ రాయల్స్‌కు ఒబెడ్ మెకోయ్
వెస్టిండీస్ ఆటగాడు ఒబెడ్ మెకోయ్ రూ. 75 లక్షలకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
రొమారియో షెఫర్డ్‌కు జాక్‌పాట్
వెస్టిండీస్ హిట్టర్ రొమారియో షెఫర్డ్ జాక్‌పాట్ కొట్టేశాడు. రూ. 75 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన షెఫర్డ్‌ను ఎస్ఆర్హెచ్ రూ. 7.75 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం.
పంజాబ్ కింగ్స్‌కు రిషి ధావన్
ఇండియా ఆల్‌రౌండర్ రిషి ధావన్‌ను రూ. 55 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
జోఫ్రా ఆర్చర్‌కు మంచి ధర
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు వేలంలో మంచి ధర పలికింది. రూ.2 కోట్ల కనీస ధరతో బరిలోకి వచ్చిన ఆర్చర్‌ను రూ. 8 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్‌ను రూ. 2.60 కోట్లకు దక్కించుకుంది.
రోవ్‌మెన్ పావెల్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రోవ్‌మెన్ పావెల్ రూ.75 లక్షలతో వేలంలోకి రాగా.. రూ. 2.8 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
రూ. కోటికి డెవన్ కాన్వే
న్యూజిలాండ్ వికెట్ కీపర్ డెవన్ కాన్వే రూ. కోటికి సీఎస్కే దక్కించుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌ను రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసింది.
ఆర్సీబీకి ఫిన్ అలెన్
న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్‌ను రూ. 50 లక్షల కనీస ధరకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.
యష్ దయాల్‌కు జాక్‌పాట్
ఉత్తర్‌ప్రదేశ్ అన్క్యాప్డ్ లెఫ్టార్మ్ సీమర్ యష్ దయాల్‌కు జాక్‌పాట్ తగిలింది. రూ. 20 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన యష్ దయాల్‌ను గుజరాత్ టైటాన్స్ రికార్డు స్థాయిలో రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. దేశవాలీ టోర్నీలైన విజయ్ హజారే, ముస్తాక్ అలీ ట్రోఫీలో చేసిన సూపర్ ప్రదర్శనతోనే యష్ దయాల్‌కు ఇంత మంచి ధర దక్కింది.
సీఎస్కేకు రాజ్‌వర్దన్ హంగేర్కర్
అండర్-19 టీమిండియా ఆటగాడు రాజ్‌వర్దన్ హంగేర్కర్ను రూ.1.5 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 30 లక్షలు. ఇక ఢిల్లీ పేసర్ సిమర్జీత్ సింగ్‌ను రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది.
గుజరాత్ టైటాన్స్‌కు దర్శన నల్కండే
దర్శన్ నల్కండేను కనీస ధర రూ.20 లక్షలకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
అండర్-19 సూపర్ స్టార్ రాజ్ బవా ముంబై ఇండియన్స్‌కు
అండర్-19 టీమిండియా స్టార్ రాజ్ బవాకు జాక్‌పాట్ తగిలింది. కనీస ధర రూ. 20 లక్షలతో బరిలోకి దిగిన అతన్ని పంజాబ్ కింగ్స్ రూ. 2 కోట్లకు దక్కించుకుంది. అండర్-19 ఆటగాళ్లలో ఇప్పటివరకు రాజ్ బవాదే అత్యధిక ధర కావడం విశేషం. అలాగే తమిళనాడు ఆల్‌రౌండర్ సంజయ్ యాదవ్‌ను ముంబై రూ.50 లక్షలకు దక్కించుకుంది.
కేకేఆర్‌కు అంకుల్ రాయ్
అన్క్యాప్డ్ ప్లేయర్ అంకుల్ రాయ్‌ను కనీస ధర రూ.20 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది.
ఆర్సీబీకి మహిపాల్ లామ్రోర్
రూ.20 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ మహిపాల్ లామ్రోర్‌ను రూ. 95 లక్షలకు ఆర్సీబీ దక్కించుకుంది.
ముంబై ఇండియన్స్‌కు తెలుగుతేజం
తెలుగుతేజం తిలక్‌వర్మను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ. 20 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ. 1.7 కోట్లకు దక్కించుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు యశ్ ధుల్, రిపల్ పటేల్, లలిత్ యాదవ్
అండర్-19 టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమ్ముడయ్యాడు. కనీస ధర రూ.20 లక్షలతో బరిలోకి దిగిన యశ్ ధుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు దక్కించుకుంది. ఇక రిపల్ పటేల్‌ను రూ. 20 లక్షలు, అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ లలిత్ యాదవ్‌ను రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.
అన్‌సోల్డ్ జాబితాలో తబ్రెయిజ్ షంసీ.. ఇంకా ఎవరంటే
కర్ణ శర్మ, పియూష్ చావ్లా, ఇష్ సోదీ, హిమ్మత్ సింగ్, విరాట్ సింగ్, సచిన్ బేబి, హిమాన్షు రాణా, హర్నూర్ సింగ్, తబ్రెయిజ్ షంసీ, నాథన్ కౌల్టర్‌నీల్, షెల్డన్ కాట్రెల్
సీఎస్కేకు మహీష్ తీక్షణ
శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణను సీఎస్కే కొనుగోలు చేసింది. రూ. 70 లక్షలకు అతన్ని దక్కించుకుంది.
ముంబై ఇండియన్స్‌కు జైదేవ్ ఉనాద్కట్, మయాంక్ మార్కండే
రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఉనాద్కట్‌ను మొదట తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. చివరి నిమిషంలో సీఎస్కే, ముంబై ఇంట్రెస్ట్ చూపాయి. చివరికి అతన్ని రూ. 1.3 కోట్లతో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ. 65 లక్షలకు మయాంక్ మార్కండేను సొంతం చేసుకుంది.
రూ.2.6 కోట్లకు రాజస్తాన్ రాయల్స్‌కు నవదీప్ సైనీ
టీమిండియా యువ పేసర్ నవదీప్ సైనీని రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 50 లక్షలు కాగా.. రూ.2.6 కోట్లకు రాజస్తాన్ దక్కించుకుంది.
కనీస మద్దతు ధరకే సందీప్ శర్మ
టీమిండియా పేసర్ సందీప్ శర్మ కనీస ధర రూ. 50 లక్షలకు పంజాబ్‌కింగ్స్‌కు అమ్ముడుపోయాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు చేతన్ సకారియా
చేతన్ సకారియాను రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్. సకారియా కనీస ధర రూ .50 లక్షలు
లక్నో సూపర్‌జెయింట్స్‌కు దుష్మంత చమీరా
శ్రీలంక పేస్ బౌలర్ దుష్మంత చమీరాను రూ. 2 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. చమీరా కనీస ధర రూ. 50 లక్షలు
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఖలీల్ అహ్మద్
టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్‌కు వేలంలో మంచి ధర లభించింది. కనీస ధర రూ. 50 లక్షలతో బరిలోకి దిగిన ఖలీల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది.
రూ. 9 కోట్ల నుంచి రూ. 90 లక్షలకు..
గతేడాది జరిగిన మినీ వేలంలో కృష్ణప్ప గౌతమ్(కే. గౌతమ్) రూ. కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మెగావేలంలో మాత్రం కేవలం రూ. 90 లక్షలకే లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 50 లక్షలు
శివమ్ దూబేకు రూ. 4 కోట్లు
ఆల్‌రౌండర్ శివమ్ దూబే కనీస ధర రూ. 50 లక్షలతో మెగా వేలంలోకి వచ్చాడు. దూబే కోసం సీఎస్కే, పంజాబ్, రాజస్తాన్ పోటీ పడ్డాయి. చివరికి సీఎస్కే రూ. 4 కోట్లతో దక్కించుకుంది.
రూ.4.20 కోట్లకు మార్కో జాన్సన్.. ఎస్ఆర్హెచ్కు
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్‌ను ఎస్ఆర్హెచ్ రూ. 4. 20 కోట్లకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. అతని కనీస ధర రూ.50 లక్షలు.
విండీస్ బౌలర్ ఓడియన్ స్మిత్‌కు ఊహించని ధర
వెస్టిండీస్ బౌలర్ ఓడియన్ స్మిత్‌కు వేలంలో ఊహించని ధర పలికింది. కనీస ధర రూ. కోటితో బరిలోకి దిగిన స్మిత్ కోసం ఎస్ఆర్హెచ్, పంజాబ్ కింగ్స్, లక్నో పోటీపడ్డాయి. అయితే చివరకు పంజాబ్ కింగ్స్ రూ. 6 కోట్లకు స్మిత్‌ను దక్కించుకుంది.
విజయ్ శంకర్‌ను సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్
టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. కనీస ధర రూ. 50 లక్షలతో బరిలోకి దిగిన శంకర్‌ను గుజరాత్ రూ.1.40 కోట్లకు కొనుగోలు చేసింది.
జయంత్ యాదవ్ ఎవరికంటే..
టీమిండియా యువ స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ. కోటితో బరిలోకి దిగిన జయంత్‌ను రూ. 1.70 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.
గుజరాత్ టైటాన్స్‌కు డొమినిక్ డ్రేక్స్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్ కనీస ధర రూ. 75 లక్షలు. వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది.
లియామ్ లివింగ్‌స్టోన్‌కు జాక్‌పాట్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు ఐపీఎల్ మెగావేలంలో జాక్‌పాట్ తగిలింది. భారీ షాట్లకు పెట్టింది పేరుగా ఉన్న లివింగ్‌స్టోన్ కోసం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పోటీ పడ్డాయి. చివరలో అనూహ్యంగా ఎస్ఆర్హెచ్ వేలంలోకి దూసుకొచ్చింది. చివరకు రూ. కోటి కనీస ధరతో బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్‌ను రూ. 11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
అన్‌సోల్డ్ జాబితాలో ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్.. ఇంకా ఎవరంటే
అన్‌సోల్డ్ జాబితాలోకి ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్, సౌరబ్ తివారి, డేవిడ్ మలాన్, చతేశ్వర్ పుజారా, జేమ్స్ నీషమ్, క్రిస్ జోర్డాన్,ఇషాంత్ శర్మ,లుంగీ ఎన్గిడి
ఢిల్లీ క్యాపిటల్స్‌కు మన్దీప్ సింగ్
అన్క్యాప్డ్ ప్లేయర్ మన్దీప్ సింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. మన్దీప్ కనీస ధర రూ. 50 లక్షలు కాగా.. రూ. 1.10 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
బేస్ ప్రైస్‌కే అమ్ముడుపోయిన రహానే
టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే కనీస ధర రూ. కోటికే కేకేఆర్ సొంతం చేసుకుంది.
ఎయిడెన్ మార్ర్కమ్.. ఎస్ఆర్హెచ్ ఖాతాలోకి
రెండోరోజు మెగావేలంలో ఎయిడెన్ మార్క్రమ్ తొలి ఆటగాడిగా వేలంలోకి వచ్చాడు. మార్క్రమ్ కనీస ధర రూ. కోటి కాగా.. ఎస్ఆర్హెచ్ రూ. 2.60 కోట్లకు మార్క్రమ్ను సొంతం చేసుకుంది.
రెండో రోజు వేలం ప్రారంభం
ఐపీఎల్ మెగావేలం తొలిరోజు దిగ్విజయంగా ముగిసింది. మొత్తంగా తొలి రోజు శనివారం వేలంలో 74 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా... ఫ్రాంచైజీలు సుమారు రూ. 388 కోట్లు వెచ్చించాయి. అయితే ఇంకా జట్లలో అన్ని స్థానాలు భర్తీ కాలేదు. కనిష్టంగా మరో 73 స్థానాలు ఖాళీగా ఉండగా టీమ్‌ల వద్ద సుమారు రూ. 173 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆదివారం కొనసాగే వేలంలో ఏ స్థాయి ఆటగాడికైనా తక్కువ మొత్తమే దక్కే అవకాశం ఉంది. మరి ఏ ఆటగాడు ఎంతకు అమ్ముడపోతాడనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లంతా ఏదో ఒక టీమ్‌లోకి వచ్చారు. కాబట్టి ఆదివారం అద్భుతం జరిగితే తప్ప ఇషాన్ రేటు దాటకపోవచ్చు.
Related News By Category
Related News By Tags
-
IPL 2022 Auction Day 1: ఇషాన్ కిషన్‌కు రికార్డు ధర.. ముంబై కొన్నది నలుగురినే
ముంబై ఇండియన్స్ తొలిరోజు మెగావేలంలో నలుగురిని మాత్రమే కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్‌కు రికార్డు స్థాయిలో రూ. 15.25 కోట్లు వెచ్చించింది. మిగతావారిలో డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, బాసిల్ థం...
-
బంతి కనిపించక ఇషాన్ కిషన్ ఉక్కిరిబిక్కిరి.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంతి కనిపించకపోవడంతో ఇషాన్ కిషన్ కాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. విషయంలోకి వెళితే.. కేకేఆర్ ఇన్నింగ్స...
-
'అప్పటివరకు బాగానే.. ఇషాన్ చెప్పగానే ఔటయ్యాడు'
ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక సమయంలో విజయం సాధించిన కేకేఆర్ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటింగ్ ల...
-
23 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డు
ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ టి20 క్రికెట్లో మరో మైలురాయిని అందుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టి20 క్రికెట్లో 3వేల పరుగు...
-
Ishan Kishan: అప్పుడు నా గుండె జారినంత పనైంది.. కానీ ఆఖరికి...
IPL 2022 Auction: ఐపీఎల్-2022 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. రిటెన్షన్‌లో భాగంగా ఇషాన్‌ను వదిలేసిన ముంబై ఇండియన్స్ వేలంలో మాత్రం ఏకంగ...
Comments
Please login to add a commentAdd a comment