
Courtesy: IPL Twitter
ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ టి20 క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టి20 క్రికెట్‌లో 3వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 23 ఏళ్ల వయసులోనే ఈ రికార్డు అందుకున్న ఇషాన్ కిషన్ పిన్న వయసుల క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. ఇప్పటివరకు ఇషాన్ కిషన్ 117 టి20 మ్యాచ్‌ల్లో 3022 పరుగులు సాధించాడు.
ఇక ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు జరిగిన మెగావేలంలో ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఇషాన్ 81 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే మిగతావారు విఫలమవ్వడంతో ముంబై ఇండియన్స్ ఆ మ్యాచ్ ఓడిపోయింది.