IPL 2022 Auction: Mumbai Indians Purchased Players List Telugu on Day 1 - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction Day 1-MI: ఇషాన్‌ కిషన్‌కు రికార్డు ధర.. ముంబై కొన్నది నలుగురినే

Published Sun, Feb 13 2022 10:58 AM | Last Updated on Sun, Feb 13 2022 11:47 AM

IPL 2022 Auction Day 1: Mumbai Indians Purchased Players List Telugu - Sakshi

ముంబై ఇండియన్స్‌ తొలిరోజు మెగావేలంలో నలుగురిని మాత్రమే కొనుగోలు చేసింది. ఇషాన్‌ కిషన్‌కు రికార్డు స్థాయిలో రూ. 15.25 కోట్లు వెచ్చించింది. మిగతావారిలో డెవాల్డ్‌ బ్రెవిస్‌, మురుగన్‌ అశ్విన్‌, బాసిల్‌ థంపి ఉ‍న్నారు. అందులో పేరున్నది ఇషాన్‌‌‌‌ ఒక్కడే. ఆ టీమ్‌‌‌‌లో రిటైన్‌‌‌‌ చేసుకున్న రోహిత్‌‌‌‌, బుమ్రా, పొలార్డ్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ (ఆక్షన్‌‌‌‌లో) తప్పితే నమ్మకం ఉంచే ప్లేయర్‌‌‌‌ లేడు.

రూల్‌‌‌‌ ప్రకారం ఆ టీమ్‌‌‌‌ కనీసం మరో పది మందిని కొనాలి. 27.85 కోట్లు మిగిలుండగా..  విదేశీ కోటాలో మరో ఏడుగురు ఆటగాళ్లకు అవకాశం ఉంది.ముంబై ఇండియన్స్‌ రిటైన్‌ జాబితాలో రోహిత్‌ శర్మ(రూ.16 కోట్లు), జస్‌ప్రీత్‌ బుమ్రా(రూ.12 కోట్లు), సూర్యకుమార్‌ యాదవ్‌(రూ. 8 కోట్లు), కీరన్‌ పొలార్డ్‌(రూ. 6 కోట్లు) ఉన్నారు.

ముంబై ఇండియన్స్‌:
ఇషాన్‌ కిషన్‌   : రూ. 15 కోట్ల 25 లక్షలు 
డెవాల్డ్‌ బ్రెవిస్: రూ. 3 కోట్లు  
మురుగన్‌ అశ్విన్‌: రూ. 1 కోటి 60 లక్షలు 
బాసిల్‌ థంపి: రూ. 30 లక్షలు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement