హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగనున్నాడు.ముంబై ఇండియన్స్ జట్టు 19 ఏళ్ల తిలక్ వర్మను రూ. కోటీ 70 లక్షలకు కొనుగోలు చేసింది. అండర్-19 ప్రపంచకప్ 2020లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా జట్టులో తిలక్‌వర్మ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీలో తిలక్ వర్మ 180 పరుగులు చేశాడు. అదే విధంగా.. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో మెగావేలంలో తిలక్ వర్మ ఐపీఎల్ జట్ల దృష్టిని ఆకర్షించాడు. అందులో భాగంగానే కనీస ధర రూ. 20లక్షలతో వేలంలోకి వచ్చిన తిలక్‌ను ముంబై మంచి ధరకే కొనుగోలు చేసింది. తిలక్ కోసం సన్‌రైజర్స్ తొలుత ప్రయత్నించినప్పటికి డ్రాప్ అయింది. దీంతో తిలక్ ముంబై ఇండియన్స్ ఖాతాలోకి వెళ్లిపోయాడు. అలాంటి తిలక్‌వర్మ జీవితంలో చాలా కష్టపడి వచ్చాడు. ఒక ఫెయిలయిన ఎలక్ట్రిషన్ తండ్రికి కొడుకుగా ఇవాళ సక్సెస్ సాధించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. మరి తిలక్‌వర్మ కథేంటో ఒకసారి గమనిద్దాం.
చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్!
తిలక్‌వర్మ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. తిలక్ తండ్రి నంబూరి నాగరాజు సాధారణ ఎలక్ట్రిషియన్. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. అయితే ఒక ఎలక్ట్రిషయన్ తండ్రి తను సాధించలేదనిది కొడుకులో చూడాలని తాపత్రయపడ్డాడు. ఎంత కష్టమైన కొడుకును క్రికెటర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబ పోషణ భారమైనప్పటికి తిలక్‌కు క్రికెట్ గేర్, బ్యాట్‌ను కొనిపెట్టి క్రికెట్ అకాడమీకి క్రమం తప్పకుండా పంపించేవాడు. ఈ సమయంలోనే తిలక్ వర్మలోని ప్రతిభను కోచ్ సాలమ్ బయాష్ గమనించాడు. తిలక్‌వర్మకు కోచింగ్‌తో పాటు తన ఇంట్లోనే వసతి కల్పించాడు. అలా అష్టకష్టాలు పడి తిలక్‌వర్మ నేడు మంచి క్రికెటర్‌గా ఎదగాడు.
2020 అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచినప్పటికి తిలక్‌వర్మ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల ముగిసిన దేశవాలీ టోర్నీలు విజయ్ హజారే ట్రోఫీతో పాటు సయ్యద్‌ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలోనూ దుమ్మురేపే ప్రదర్శన కనబరిచాడు. ఇక కోవిడ్-19 సమయంలో తిలక్‌వర్మ కుటుంబం చాలా కష్టాలు పడింది. తండ్రి నాగరాజు సరిగ్గా కాంట్రాక్ట్‌లు రాకపోవడంతో కొన్నిరోజులు పస్తులుండాల్సింది. అయితే ఇక్కడ విషయమేంటంటే కుటుంబం అంత కష్టాల్లో ఉందన్న విషయం తిలక్‌వర్మకు తెలియదట. ఎంత కష్టమైనా సరే అప్పు తెచ్చైనా కొడుకు డబ్బులు పంపేవాడు. ఈ విషయాన్ని తిలక్ వర్మ ఇటీవలే ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్ మెగావేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడంపై తిలక్ వర్మ హర్షం వ్యక్తం చేశాడు. ‘ఐపీఎల్‌లో ఆడాలన్నది నా కల. పలు ఫ్రాంచైజీలు నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొన్నాను. తమ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించడానికి ఐపీఎల్ మంచి వేదిక. నా భవిష్యత్తుకు ఇది మంచి పునాదిలా ఉపయోగపడుతుందని భావిస్తున్నా వేలంలో ముంబై ఇండియన్స్‌కు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నా. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టుతో నా ఐపీఎల్ కెరీర్‌ను ఆరంభించనుండడం సంతోషం కలిగిస్తుంది’ అంటూ తిలక్ వర్మ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment