![Twist-Turn Arjun Tendulkar Sold 25 Lakhs Mumbai Indians IPL 2022 Auction - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/14/Mumbai.jpg.webp?itok=8VwPQGm0)
ఐపీఎల్ మెగావేలంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ చివర్లో వేలంలోకి వచ్చాడు. సచిన్ మీద ఉన్న అభిమానంతో అర్జున్‌ను మళ్లీ ముంబై ఇండియన్స్ బేస్‌ప్రైస్‌కు కొనుగోలు చేస్తుందని అంతా భావించారు. అన్నట్లుగానే ముంబై అతన్ని రూ. 20 లక్షలకు తీసుకుందామని సిద్ధపడింది.
చదవండి: IPL 2022 Auction: ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం
ఇక్కడే ట్విస్టు ఎదురైంది. అర్జున్‌ను తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్ ప్యాడ్ ఎత్తి రూ. 5 లక్షలు పెంచింది. దాంతో అంబానీ, జహీర్ ఇదేంటి... అన్నట్లుగా చిరునవ్వు చూపుతో ఆశిష్ నెహ్రా వైపు చూడటం... మరోసారి ప్యాడ్ ఎత్తి ముంబై రూ. 25 లక్షలకే తీసుకోవడం చకచగా జరిగిపోయాయి. గతేడాది తొలిసారి ముంబై ఇండియన్స్ టీమ్‌కు వచ్చిన అర్జున్ టెండూల్కర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరి ఈసారైనా ముంబై తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తాడేమో చూడాలి.
చదవండి: IPL 2022 Auction: ‘మాకు అనామకులే కావాలి’.. సన్‌రైజర్స్ తీరే వేరు
Comments
Please login to add a commentAdd a comment