Ahmedabad Titans
-
ఆ ఆటగాడు మాకే సొంతం.. మీరెలా తీసుకుంటారు!
ఐపీఎల్ మెగావేలంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ చివర్లో వేలంలోకి వచ్చాడు. సచిన్ మీద ఉన్న అభిమానంతో అర్జున్ను మళ్లీ ముంబై ఇండియన్స్ బేస్‌ప్రైస్‌కు కొనుగోలు చేస్తుందని అంతా భావించారు. అన్నట్లుగానే ముంబై అతన్ని రూ. 20 లక్షలకు తీసుకుందామని సిద్ధపడింది. చదవండి: IPL 2022 Auction: ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం ఇక్కడే ట్విస్టు ఎదురైంది. అర్జున్ను తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్ ప్యాడ్ ఎత్తి రూ. 5 లక్షలు పెంచింది. దాంతో అంబానీ, జహీర్ ఇదేంటి... అన్నట్లుగా చిరునవ్వు చూపుతో ఆశిష్ నెహ్రా వైపు చూడటం... మరోసారి ప్యాడ్ ఎత్తి ముంబై రూ. 25 లక్షలకే తీసుకోవడం చకచగా జరిగిపోయాయి. గతేడాది తొలిసారి ముంబై ఇండియన్స్ టీమ్‌కు వచ్చిన అర్జున్ టెండూల్కర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరి ఈసారైనా ముంబై తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేస్తాడేమో చూడాలి. చదవండి: IPL 2022 Auction: ‘మాకు అనామకులే కావాలి’.. సన్‌రైజర్స్ తీరే వేరు -
అన్క్యాప్డ్ ప్లేయర్‌కు అంత ధర.. ఎవరీ యష్ దయాల్
ఐపీఎల్ మెగావేలంలో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌కు ఊహించని ధర పలికింది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యష్ దయాల్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 3.20 కోట్లకు దక్కించుకుంది. కేవలం రూ.20 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన యష్ దయాల్‌కు గుజరాత్ 16 రేట్లు ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేయడం విశేషం. యష్ దయాల్ కోసం కేకేఆర్, ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌లు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఒక అనామక ఆటగాడికి ఇంత ధర పలకడానికి కారణం దేశవాలీ టోర్నీలే కారణం. విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఈ యువ పేసర్ అదరగొట్టాడు. ముఖ్యంగా విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తర్ ప్రదేశ్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా యష్ దయాల్ నిలిచాడు. తొలి స్థానంలో శివమ్ మావి 15 వికెట్లతో ఉన్నాడు. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 1997, డిసెంబర్ 13న జన్మించిన యష్ దయాల్ 2018లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారా దేశవాలీ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నవంబర్ 2018లో రంజీ ట్రోఫీ, 2019 ఫిబ్రవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో అడుగుపెట్టాడు. -
IPL 2022: హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ జట్టుకు సంబంధించి కీలక అప్డేట్
ఐపీఎల్ 2022 సీజన్‌తో లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లక్నో ఇదివరకే జట్టు పేరుతో పాటు లోగోను సైతం ఆవిష్కరించగా.. తాజాగా సీవీసీ క్యాపిటల్ ఇవాళ తమ జట్టు పేరును "అహ్మదాబాద్ టైటాన్స్"గా ప్రకటించింది. మెగా వేలానికి కేవలం ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో సీవీసీ సంస్థ హడావుడిగా జట్టుకు నామకరణం చేసింది. జట్టు లోగోను ఆవిష్కరించాల్సి ఉంది. కాగా, బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ టైటాన్స్‌ను రూ. 5625 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్ గ్రూప్.. జట్టు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను ఎంచుకుంది. ఇందుకు గాను అతనికి రికార్డు స్థాయిలో రూ. 15 కోట్లు చెల్లించింది. అలాగే రషీద్ ఖాన్‌కు 15 కోట్లు, శుభ్‌మన్ గిల్‌ను 8 కోట్లకు డ్రాఫ్ట్ చేసుకుంది. వీరితో పాటు కోచ్‌గా ఆశిష్ నెహ్రాను, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టన్‌ను నియమించుకుంది. మరోవైపు రూ.7090 కోట్లు పెట్టి లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న ఆర్పీఎస్ గోయింకా సంస్థ, తమ జట్టు పేరును లక్నో సూపర్ జెయింట్స్‌గా.. కేఎల్ రాహుల్(17 కోట్లు)ను కెప్టెన్‌గా, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్(9.2 కోట్లు), రవి బిష్ణోయ్(4 కోట్లు)లను డ్రాఫ్ట్‌లుగా ఎంచుకుంది. ఈ జట్టుకు కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించనుండగా.. మెంటార్‌గా గౌతం గంభీర్ నియమితుడయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇటీవలే తమ లోగోను కూడా ఆవిష్కరించింది. చదవండి: IPL 2022: కేఎల్ రాహుల్ జట్టుకు సంబంధించి కీలక అప్డేట్