ఐపీఎల్ మెగావేలంలో ఒక అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌కు ఊహించని ధర పలికింది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యష్ దయాల్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 3.20 కోట్లకు దక్కించుకుంది. కేవలం రూ.20 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన యష్ దయాల్‌కు గుజరాత్ 16 రేట్లు ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేయడం విశేషం. యష్ దయాల్ కోసం కేకేఆర్, ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌లు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఒక అనామక ఆటగాడికి ఇంత ధర పలకడానికి కారణం దేశవాలీ టోర్నీలే కారణం.
విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఈ యువ పేసర్ అదరగొట్టాడు. ముఖ్యంగా విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తర్ ప్రదేశ్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా యష్ దయాల్ నిలిచాడు. తొలి స్థానంలో శివమ్ మావి 15 వికెట్లతో ఉన్నాడు. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 1997, డిసెంబర్ 13న జన్మించిన యష్ దయాల్ 2018లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారా దేశవాలీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నవంబర్ 2018లో రంజీ ట్రోఫీ, 2019 ఫిబ్రవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో అడుగుపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment