ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ అర్జున్ టెండూల్కర్ తన రెండో మ్యాచ్‌లోనే తేలిపోయాడు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అర్జున్ దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మూడు ఓవర్లు వేసిన అర్జున్ 48 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.
మరో విచిత్రమేంటంటే.. తొలి రెండు ఓవర్లు బాగానే బౌలింగ్ చేసిన అర్జున్.. తాను వేసిన మూడో ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఒక దశలో పంజాబ్ కింగ్స్ 160 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ అర్జున్ టెండూల్కర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మర్చేసింది. ఆ ఓవర్‌లో అర్జున్ వైడ్, నోబ్ సహా 6,4,4,6,4,4,1 మొత్తంగా 31 పరుగులు సమర్పించుకొని ముంబై కొంపముంచాడు. ఈ దెబ్బతోనే పంజాబ్ కింగ్స్ స్కోరు 200 దాటింది. దీనికి పరోక్షంగా కారణం అర్జున్ టెండూల్కర్ అనే నిస్సందేహంగా చెప్పొచ్చు.
కాగా కేకేఆర్‌తో మ్యాచ్ ద్వారా అర్జున్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన అర్జున్ ఒక వికెట్ తీశాడు. అంతే సోషల్ మీడియాలో అర్జున్ టెండూల్కర్ పేరు మార్మోగిపోయింది. అరె ఏం బౌలింగ్ చేశాడంటూ ఊదరగొట్టారు. కానీ నిజానికి అర్జున్ టెండూల్కర్ చేసిందేమి లేదు. అప్పటికే ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి ఖరారైపోయింది. తన వంతుగా ఆఖరి వికెట్ తీసిన ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆలౌట్ మాత్రమే చేశాడు. దీనికే అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు.
Arjun Tendulkar bowled the joint-most expensive over in #IPL2023 so far (31 runs).
— CricTracker (@Cricketracker) April 22, 2023
📸: Jio Cinema pic.twitter.com/VuJMNh4l7R
దిగ్గజం సచిన్ కుమారుడు కావడంతో అందరు అర్జున్‌ను ఆకాశానికెత్తారు. కానీ అతని బౌలింగ్ ప్రతిభ ఏంటనేది పంజాబ్‌తో మ్యాచ్‌లో బయటపడింది. మ్యాచ్‌లో నాలుగు వైడ్స్ వేసిన అర్జున్ కొన్ని యార్కర్లతో మెప్పించినప్పటికి ప్రత్యర్థి బ్యాటర్లను మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాడు. సామ్ కరన్, హర్‌ప్రీత్ బాటియాలు అర్జున్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు.
Comments
Please login to add a commentAdd a comment