'Many mocked him for nepotism': Preity Zinta praises Arjun Tendulkar - Sakshi
Sakshi News home page

#ArjunTendulkar: 'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు'

Published Wed, Apr 19 2023 5:06 PM | Last Updated on Wed, Apr 19 2023 5:45 PM

Preity Zinta Praises Arjun Tendulkar-Says Many Mocked Him-For Nepotism - Sakshi

ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 14 పరుగుల తేడాతో గెలిచి సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. పెద్దగా అనుభవం లేకపోయినప్పటికి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆఖరి ఓవర్లో బంతిని అర్జున్‌ టెండూల్కర్‌ చేతికి ఇచ్చాడు. అయితే కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ అద్భుతంగా బౌలింగ్‌ చేసిన అర్జున్‌ ఒక వికెట్‌ తీసుకొని నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

అంతేకాదు భువనేశ్వర్‌ను ఔట్‌ చేసిన అర్జున్‌ తన ఖాతాలో తొలి వికెట్‌ను వేసుకున్నాడు.  అర్జున్‌ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఒకప్పుడు క్రికెటర్‌గా పనికిరాడు అని ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.  తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని ప్రీతి జింటా అర్జున్‌ టెండూల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.

''చాలా మంది అర్జున్‌ను బంధుప్రీతి అంటూ ఎగతాళి చేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అద్బుతంగా బౌలింగ్‌ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. పెద్దగా అనుభవం లేనప్పటికి ఆఖరి ఓవర్లో సూపర్‌ బౌలింగ్‌ చేసి కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టాడు. అర్జున్‌కు అభినందనలు.  అర్జున్‌ ప్రదర్శన పట్ల సచిన్ కచ్చితంగా గర్వించాలి.'' అని పేర్కొంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 60 పరుగులు నాటౌట్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. తిలక్‌ వర్మ 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. ఇషాన్‌ కిషన్‌ 38 పరుగులు చేశాడు.

అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్‌ అయింది. మయాంక్‌ అగర్వాల్‌ 48 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్‌ 36, మార్క్రమ్‌ 22 పరుగులు చేసి ఔటయ్యారు.

చదవండి: పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే

#Tilak Varma: ఉన్నది కాసేపే.. కానీ దడదడలాడించాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement