Breadcrumb
- HOME
IPL 2022 Mega Auction Day 1 Updates: మెగా వేలం తొలిరోజు ఇలా..
Published Sat, Feb 12 2022 11:01 AM | Last Updated on Sun, Feb 13 2022 9:14 AM
Live Updates
ఐపీఎల్ మెగా వేలం- 2022 అప్డేట్స్
తొలి రోజు ముగిసిన వేలం.. రికార్డు సృష్టించిన ఇషాన్ కిషన్
ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. మెదటి రోజు వేలంలో ఇషాన్ కిషన్ కు అత్యధిక ధర దక్కింది. కిషన్‌ను రూ.15. 25 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అదే విధంగా దీపక్ చాహర్‌ను రూ. 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. మరో వైపు ఆన్ క్యాపిడ్ ఆటగాళ్లు ఆవేష్ ఖాన్, షారుక్ ఖాన్‌ను వరుసగా రూ. 10 కోట్లు, 9 కోట్లు దక్కాయి. ఆవేష్ ఖాన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకోగా, షారుక్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. మరో వైపు సురేష్ రైనా, స్టీవ్ స్మిత్, ఇమ్రాన్ తహీర్, నబీ వంటి స్టార్ ఆటగాళ్లు వేలంలో తొలి రౌండ్లో అమ్ముడు పోలేదు. కాగా రెండో రోజు వేలం ఆదివారం జరగనుంది.
సాయి కిషోర్‌ను సొంతం చేసుకున్న గుజరాత్
రవి శ్రీనివాసన్ సాయి కిషోర్‌ను గుజరాత్ టైటన్స్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది.
అంకిత్ రాజ్‌పూత్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది
అంకిత్ రాజ్‌పూత్‌ను రూ.50 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
మురగన్ అశ్విన్‌ను దక్కించుకున్న ముంబై
తమిళనాడు స్పిన్నర్ మురగన్ అశ్విన్‌ను రూ.1.60 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది
శ్రేయాస్ గోపాల్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
కర్ణాటక ఆల్‌రౌండర్ శ్రేయాస్ గోపాల్‌ను రూ.75 లక్షల సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
ఇషాన్ పోరెల్‌ను దక్కించుకున్న పంజాబ్ కింగ్స్
బెంగాల్ ఫాస్ట్ బౌలర్ ఇషాన్ పోరెల్‌ను రూ.25 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
అవేష్ ఖాన్‌కు జాక్ పాట్.. రూ. 10 కోట్లకు దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్
మధ్యప్రదేశ్ బౌలర్ అవేష్ ఖాన్‌కు వేలంలో భారీ ధర దక్కింది. వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌గా ఉన్న అవేష్ ఖాన్‌ను రూ.10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
శ్రీకర్ భరత్‌ను రూ. 2 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ
ఆంధ్రా ఆటగాడు శ్రీకర్ భరత్‌ను రూ. 2 కోట్లకు ఢిల్లీ అతడిని కొనుగోలు చేసింది.
హర్‌ప్రీత్ బారార్ను దక్కించుకున్న పంజాబ్ కింగ్స్
హర్‌ప్రీత్ బారార్ను రూ. 3.80 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టుకే ఆడాడు
శివమ్ మావిను దక్కించుకున్న కేకేఆర్
శివమ్ మావి మళ్లీ సొంత గూటికి చేరుకున్నాడు. వేలంలో రూ.40 లక్షల బేస్ ప్రైస్‌గా ఉన్న శివమ్ మావిను రూ. 7.25 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.
నాగార్కోటిను దక్కించుకున్న ఢిల్లీ
రాజస్తాన్ ఫాస్ట్ బౌలర్ కమలేష్ నాగార్కోటిను రూ.1.10 ఢిల్లీ క్యాపిటిల్స్ కొనుగోలు చేసింది.
రాహుల్ తివాటియాకు జాక్ పాట్.. రూ. 9 కోట్లకు గుజరాత్ టైటన్స్
రాజస్తాన్ మాజీ ఆల్ రౌండర్ రాహుల్ తివాటియాకు మెగా వేలంలో జాక్ పాట్ తగిలింది. రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌గా ఉన్న తివాటియాను గుజరాత్ టైటన్స్ రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. అతడి కోసం రాజస్తాన్, గుజరాత్ పోటీ పడ్డాయి. చివరకు గుజరాత్ టైటన్స్ కైవసం చేసుకుంది.
పంజాబ్ కింగ్స్‌కు షారుఖ్ ఖాన్.. రూ.9 కోట్లకు
తమిళనాడు ఆల్ రౌండర్ షారుఖ్ ఖాన్‌కి భారీ ధర దక్కింది. మళ్లీ అతడిని పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌గా ఉన్న షారుఖ్ ఖాన్‌ను రూ.9 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
అభిషేక్ శర్మకి జాక్‌పాట్.. 6.80 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం
ఆల్ రౌండర్ అభిషేక్ శర్మకి జాక్‌పాట్ తగిలింది. మళ్లీ సొంత గూటికే అభిషేక్ చేరుకున్నాడు. వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌గా ఉన్న అభిషేక్ శర్మను రూ. 6.80 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
పరాగ్‌ను దక్కించుకున్న రాజస్తాన్.. రూ. 3.80 కోట్లకు
రియాన్ పరాగ్‌ను మళ్లీ రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది. వేలంలో రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌గా ఉన్న పరాగ్‌ను రూ. 3.80 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.
రాహుల్ త్రిపాఠికు భారీ ధర.. రూ.8.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ సొంతం
కేకేఆర్ మాజీ ఆటగాడు రాహుల్ త్రిపాఠికు భారీ ధర దక్కింది. వేలంలో రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌గా ఉన్న త్రిపాఠిను రూ. 8.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని కొనుగోలు చేసింది.
అశ్విన్ హెబ్బార్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటిల్స్
భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అశ్విన్ హెబ్బార్‌ను రూ.20 లక్షలకు ఢిల్లీ క్యాపిటిల్స్ కొనుగోలు చేసింది.
ముంబై ఇండియన్స్‌కు బేబీ ఏబీడీ.. ధర ఎంతంటే?
దక్షిణాఫ్రికా యువ ఆటగాడు బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్‌ను ముంబై ఇండియన్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. అతడి కోసం పంజాబ్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. చివరకి బ్రెవిస్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
మనోహర్ సాదరంగానిను దక్కించుకున్న గుజరాత్ టైటన్స్
భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అభినవ్ మనోహర్ సాదరంగానిను రూ. 2.60 కోట్లకు గుజరాత్ టైటన్స్ సొంతం చేసుకుంది.
రాజస్తాన్‌కు చాహల్.. ధర ఎంతంటే
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను రూ. 6.50 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.వేలంలో బేస్ ప్రైస్ 2 కోట్లగా ఉన్న చాహల్‌కి రూ. 6.50 దక్కింది.
రాహుల్ చాహర్‌ను దక్కించుకున్న పంజాబ్..
టీమిండియా స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను రూ. 5.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. చాహర్ కోసం రాజస్తాన్, పంజాబ్,ఢిల్లీ , ముంబై ఇండియన్స్ తీవ్ర పోటీ పడ్డాయి. చివరకి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
కుల్దీప్ యాదవ్‌ను దక్కించుకున్న ఢిల్లీ..
టీమిండియా స్సిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపటిల్స్ కైవసం చేసుకుంది.
ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను దక్కించుకున్న ఢిల్లీ
బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటిల్స్ కైవసం చేసుకుంది.
శార్ధూల్ ఠాకుర్‌కు భారీ ధర.. రూ.10.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం
వేలంలో టీమిండియా పేసర్ శార్ధూల్ ఠాకుర్‌కు భారీ ధర దక్కింది. రూ.10.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. శార్ధూల్ కోసం ఢిల్లీ , పంజాబ్ తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకి ఢిల్లీ క్యాపటిల్స్ శార్ధూల్ ఠాకుర్‌ను సొంతం చేసుకుంది.
మళ్లీ ఎస్ఆర్హెచ్కు భువనేశ్వర్.. ధర ఎంతంటే?
టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను రూ.4.20 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. భువీ కోసం సూపర్ జాయింట్స్, ఎస్ఆర్హెచ్ పోటీ పడ్డాయి. చివరకి సన్‌రైజర్స్ హైదరాబాద్ భువీను సొంతం చేసుకుంది
లక్నో సూపర్ జెయింట్స్‌కు మార్క్ వుడ్
వేలంలో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్‌ను రూ. 7.50 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
హేజల్‌వుడ్‌ను దక్కించుకున్న ఆర్సీబీ..
వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్‌వుడ్‌ను రూ.7.75 కోట్లకు ఆర్సీబీ కైవసం చేసుకుంది. హేజల్‌వుడ్ కోసం ఆర్సీబీ, ఢిల్లీ పోటీ పడ్డాయి. చివరకి ఆర్సీబీ కొనుగోలు చేసింది
ఫెర్గూసన్‌కి భారీ ధర.. రూ. 10 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటన్స్
వేలంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్‌కి భారీ దక్కింది. రూ. 10 కోట్లకు ఫెర్గూసన్‌ను గుజరాత్ టైటన్స్ కైవసం చేసుకుంది.
ప్రసిద్ధ్ కృష్ణకి జాక్‌పాట్.. రూ. 10 కోట్లకు రాజస్తాన్ సొంతం
టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకి వేలంలో జాక్‌పాట్ తగిలింది. వేలంలో అతడిని రాజస్తాన్ రాయల్స్ రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ కోసం కేకేఆర్, రాజస్తాన్ పోటీ పడ్డాయి. చివరకి రాజస్తాన్ ప్రసిద్ధ్ కృష్ణను కైవసం చేసుకుంది.
దీపక్ చాహర్ కి భారీ ధర.. 14 కోట్లకు చెన్నై కైవసం
వేలంలో టీమిండియా దీపక్ చాహర్ భారీ ధర పలికాడు. అతడిని సీఎస్కే రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఇప్పటి వరకు చాహర్‌దే రెండో అత్యధిక ధర కావడం విశేషం. అంతకుముందు ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ 15.25 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా గత సీజన్లో సీఎస్కేకు చాహర్ ఆడాడు.
నటరాజన్‌ను దక్కించుకున్న ఎస్ఆర్హెచ్.. ధర ఎంతంటే?
టీమిండియా స్టార్ పేసర్ టి నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 4 కోట్లకు కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో నటరాజన్ కోసం గుజరాత్ టైటన్స్, సన్‌రైజర్స్ పోటీ పడ్డాయి. చివరకు అతడిని ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది.
రూ. 10.75 కోట్లు కొల్లగొట్టిన నికోలస్ పూరన్.. ఎస్ఆర్హెచ్కు
విండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్‌కు భారీ ధర పలికింది. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు కాగా.. రూ. 10.75 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. కాగా పూరన్ కోసం ఎస్ఆర్హెచ్, కేకేఆర్ చివరి వరకు పోటీపడ్డాయి. కానీ ఎస్ఆర్హెచ్ పూరన్‌ను దక్కించుకుంది.
అన్‌సోల్డ్ జాబితాలోకి వృద్ధిమాన్ సాహా, సామ్ బిల్లింగ్స్, మహ్మద్ నబీ
అన్‌సోల్డ్ జాబితాలోకి వృద్ధిమాన్ సాహా, సామ్ బిల్లింగ్స్, మహ్మద్ నబీ. వీరిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు.
రూ. 5.5 కోట్లకు ఆర్సీబీకి దినేశ్ కార్తిక్
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్‌ను ఆర్సీబీ రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేసింది. దినేశ్ కార్తిక్ కోసం సీఎస్కే ప్రయత్నించినప్పటికి చివరికి ఆర్సీబీ సొంతం చేసుకుంది.
పంజాబ్ కింగ్స్‌కు జానీ బెయిర్ స్టో
ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో రూ. 6.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్ పోటీ పడినప్పటికి బెయిర్ స్టోను దక్కించుకోవడంలో విఫలమైంది.
.@jbairstow21 is sold to @PunjabKingsIPL for INR 6.75 crore#TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
ముంబై ఇండియన్స్‌కు సొంతమైన ఇషాన్ కిషన్.. రికార్డు ధరకు
టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు భారీ జాక్‌పాట్ తగిలింది. ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈసారి వేలంలో ఇప్పటివరకు అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇషాన్ కిషన్ కావడం విశేషం. ఇషాన్ కంటే ముందు శ్రేయాస్ అయ్యర్ రూ. 12.50 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.
We're sure you loved that bid @mipaltan 😉💙
— IndianPremierLeague (@IPL) February 12, 2022
Welcome back to the Paltan @ishankishan51 pic.twitter.com/xwTbSi9z7b
రూ 6.75 కోట్లకు సీఎస్కేకు అంబటి రాయుడు
తెలుగుతేజం అంబటి రాయుడు మళ్లీ సీఎస్కే గూటికి చేరాడు. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన రాయుడు కోసం ఎస్ఆర్హెచ్, సీఎస్కే పోటీ పడ్డాయి. చివరకు సీఎస్కే రూ. 6.75 కోట్లకు రాయుడుని సొంతం చేసుకుంది.
కనీస ధరకే అమ్ముడైన ఊతప్ప, జేసన్ రాయ్
టీమిండియా సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్పను కనీస ధర రూ. 2 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేయగా.. ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్ల కనీస ధరకు దక్కించుకుంది.
మిచెల్ మార్ష్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఆస్ట్రేలియన్ స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.50 కోట్లకు సొంతం చేసుకుంది.
Mitchell Marsh sold for INR 6.5 crore to @DelhiCapitals #TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
లక్నో సూపర్‌జెయింట్స్‌కు కృనాల్ పాండ్యా
టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు మెగావేలంలో మంచి ధర పలికింది. లక్నో సూపర్ జెయింట్స్ కృనాల్ పాండ్యాను రూ. 8.25 కోట్లకు దక్కించుకుంది. చివరివరకు ఎస్ఆర్హెచ్ పోటీ పడినప్పటికి అతన్ని దక్కించుకోలేకపోయింది.
వాషింగ్టన్ సుందర్‌కు భారీ ధర.. ఎస్ఆర్హెచ్ ఖాతాలోకి
టీమిండియా యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కనీస ధర రూ. 1.50 కోట్లతో వేలానికి వచ్చాడు. గత సీజన్లో సుందర్ ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. మొదట సుందర్‌ను దక్కించుకోవడం కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. అయితే అనూహ్యంగా దూసుకొచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 8.75 కోట్లకు సుందర్‌ను దక్కించుకుంది. ఆర్సీబీ తరపున రూ. 3.25 కోట్లతో ఉన్న సుందర్‌కు రూ. 5 కోట్లు ఎక్కువగా రావడం విశేషం.
ఆర్సీబీకి వనిందు హసరంగ.. రూ. 10.75 కోట్లకు
శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. కనీస ధర రూ. కోటితో వేలంలో అడుగుపెట్టిన హసరంగాను దక్కించుకునేందుకు పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ పోటాపోటీగా తలపడుతున్నాయి. చివరికి రూ.10.75 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. కాగా టి20 ప్రపంచకప్ 2021లో హసరంగా హ్యాట్రిక్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఎడ్మడేస్ స్థానంలో చారుశర్మ.. కాసేపట్లో తిరిగి వేలం ప్రారంభం
ఐపీఎల్ ఆక్షనీర్ ఎడ్మడేస్ కళ్లు తిరిగి పడిపోవడంతో మెగావేలానికి కాసేపు బ్రేక్ లభించింది. కాగా లో బ్లడ్ ప్రెజర్ కారణంగా ఎడ్మడేస్ సృహ తప్పినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఎడ్మడేస్కు విశ్రాంతినిచ్చి.. చారుశర్మ మిగతా వేలానికి ఆక్షనీర్‌గా వ్యవహరించనున్నారు.
కళ్లు తిరిగిపడిపోయిన ఆక్షనీర్ ఎడ్మెడేస్
ఐపీఎల్ మెగా వేలం-2022లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆక్షనీర్ ఎడ్మెడేస్ కళ్లు తిరిగిపడిపోయాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్‌కు గురయ్యారు. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ కోసం పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో వేలం నిలిపివేశారు.
వనిందు హసరంగా కోసం ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పోటాపోటీ
శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. కనీస ధర రూ. కోటితో వేలంలో అడుగుపెట్టిన హసరంగాను దక్కించుకునేందుకు పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ పోటాపోటీగా తలపడుతున్నాయి. కాగా టి20 ప్రపంచకప్ 2021లో హసరంగా హ్యాట్రిక్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
లక్నో సూపర్‌జెయింట్స్‌కు దీపక్ హుడా
టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడాను రూ. 5.75 కోట్లతో లక్నో సూపర్‌జెయింట్స్ దక్కించుకుంది. కనీస ధర రూ. 75 లక్షలుగా ఉన్న దీపక్ హుడాకు ఇది మంచి ధరే అని చెప్పొచ్చు.
హర్షల్ పటేల్‌కు బంపర్ ఆఫర్
టీమిండియా యువ బౌలర్ హర్షల్ పటేల్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన హర్షల్ పటేల్‌ను ఆర్సీబీ రూ. 10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో ఆర్సీబీ తరపున 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్‌పై నమ్మకముంచిన ఆర్సీబీ మరోసారి కొనుగోలు చేసింది.
జాసన్ హోల్డర్‌కు జాక్‌పాట్
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ వేలంలోకి వచ్చాడు. అతని కనీస ధర రూ.1.50 కోట్లుగా ఉంది. కాగా హోల్డర్‌కు జాక్‌పాట్ తగిలింది. రూ. 8.75 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్ దక్కించుకుంది.
నితీష్ రాణాకు రూ. 8 కోట్లు..
టీమిండియా అన్క్యాప్డ్ ఆటగాడు నితీష్ రాణాను మరోసారి కేకేఆర్ సొంతం చేసుకుంది. రూ. 8 కోట్లకు రాణాను సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్లో నితీష్ రాణా మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.
మరోసారి సీఎస్కేకు డ్వేన్ బ్రేవో
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోను సీఎస్కే మరోసారి దక్కించుకుంది. రూ. 4.40 కోట్లకు సీఎస్కే బ్రేవోను దక్కించుకుంది.
అన్‌సోల్డ్‌గా సురేశ్ రైనా, స్టీవ్ స్మిత్, డేవిడ్ మిల్లర్
టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాతో పాటు.. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనడానికి ఆసక్తి చూపలేదు. యాక్సిలరేటెడ్ లిస్ట్‌లో ఈ ముగ్గురు మరోసారి వేలంలోకి రానున్నారు.
పడిక్కల్‌కు భారీ ధర.. రాజస్తాన్ రాయల్స్‌కు
టీమిండియా యువ ఆటగాడు దేవదూత్ పడిక్కల్‌కు మెగావేలంలో భారీ ధర పలికింది. పడిక్కల్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. రాజస్తాన్ రాయల్స్‌కు రూ. 7.75 కోట్లు వెచ్చించి పడిక్కల్‌ను కొనుగోలు చేసింది. గత సీజన్లో ఆర్సీబీకి రూ. 20 లక్షలకు అమ్ముడుపోయిన పడిక్కల్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే.
హెట్‌మైర్‌కు భారీ ధర.. రాజస్తాన్ రాయల్స్‌కు
వెస్టిండీస్ హిట్టర్ షిమ్రోన్ హెట్‌మైర్‌కు వేలంలో మంచి ధరే దక్కింది. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ పోటీపడ్డాయి. చివరకు రాజస్తాన్ రాయల్స్ రూ. 8.25 కోట్లకు హెట్మైర్ను దక్కించుకుంది.
IPL 2022 Mega Auction: మెగా వేలం ఆరంభం
రూ.4.6 కోట్లు.. లక్నో సూపర్‌జెయింట్స్‌కు మనీష్ పాండే
మనీష్ పాండేను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 4.6 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. కోటి
ఢిల్లీ క్యాపిటల్స్‌కు డేవిడ్ వార్నర్.. ధర ఎంతో తెలుసా
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. అయితే వార్నర్ ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోతాడని ఎవరు ఊహించలేదు. 2016 ఎస్ఆర్హెచ్ను చాంపియన్స్‌గా నిలిపిన వార్నర్‌ను ఎస్ఆర్హెచ్ అవమానకరరీతిలో రిలీజ్ చేసింది. ఆ తర్వాత వార్నర్ తనదైన ఆటతీరుతో మెప్పించాడు. ఈసారి వేలంలో మంచి ధర దక్కుతుంది అని భావించిన ఫ్యాన్స్‌కు ఇది నిరాశే అని చెప్పొచ్చు.
.@davidwarner31 is SOLD to @DelhiCapitals for INR 6.25 Crore#TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
రూ.6.75 కోట్లకు డికాక్.. ఎవరికంటే
గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్వింటన్ డికాక్ కనీస ధర రూ. 2 కోట్లు. కాగా లక్నో సూపర్‌జెయింట్స్ రూ. 6.75 కోట్లకు డికాక్‌కు కొనుగోలు చేసింది.
రూ. 7కోట్లకు ఆర్సీబీకి డుప్లెసిస్
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఫాప్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 2 కోట్లు ఉంది. గత సీజన్ వరకు డుప్లెసిస్ సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
గుజరాత్ టైటాన్స్‌కు మహ్మద్ షమీ..
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కనీస ధర రూ. 2 కోట్లు. గత సీజన్లో షమీ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా షమీని ఈసారి వేలంలో రూ. 6.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
రూ. 12.25 కోట్లకు కేకేఆర్‌కు శ్రేయాస్ అయ్యర్
టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వేలంలోకి వచ్చాడు. ముందు నుంచి అయ్యర్‌పై మంచి అంచనాలు ఉండడంతో అతనికి మంచి ధర పలికే అవకాశం ఉంది. గతేడాది వరకు రూ. 7కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన అయ్యర్ కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తో పోటీపడిన కేకేఆర్ చివరకు అయ్యర్‌ను రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది.
.@ShreyasIyer15 is SOLD to @KKRiders for INR 12.25 Crore 👌💰👏#TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
బౌల్ట్‌ను దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్.. ధర ఎంతంటే
న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేలంలోకి వచ్చాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. బౌల్ట్‌ను దక్కించుకోవడం కోసం రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి రాజస్తాన్ రాయల్స్ రూ. 8 కోట్లకు బౌల్ట్‌ను దక్కించుకుంది.
రూ.9.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు కగిసో రబాడ
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా కనీస ధర రూ. 2 కోట్లు. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన రబాడపై ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ గట్టిపోటి ఇచ్చినప్పటికి.. చివరికి పంజాబ్ కింగ్స్ రూ. 9.25 కోట్లతో రబాడను దక్కించుకుంది.
భారీగా తగ్గిన పాట్ కమిన్స్ ధర.. మళ్లీ కేకేఆర్కే
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో ఆటగాడిగా వేలంలోకి వచ్చాడు. కమిన్స్ కనీస ధర రూ. 2 కోట్లు. గతేడాది వేలంలో కేకేఆర్(రూ.15.50 కోట్లు) అత్యధిక ధరకు అమ్ముడైన పాట్ కమిన్స్.. ఈసారి మాత్రం సగానికి పడిపోయాడు. రూ. 7.25 కోట్లతో కమిన్స్‌ను మళ్లీ కేకేఆర్ కొనుగోలు చేసింది.
రూ. 5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్‌కు రవిచంద్రన్ అశ్విన్
వేలంలో రెండో ఆటగాడిగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంటరయ్యాడు. అశ్విన్ కనీస ధర రూ.2 కోట్లు. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అశ్విన్ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా వేలంలో అశ్విన్‌ను రాజస్తాన్ రాయల్స్ రూ.5 కోట్లకు దక్కించుకుంది.
.@ashwinravi99 is SOLD to @rajasthanroyals for INR 5 Crores#TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
పంజాబ్ కింగ్స్‌కు శిఖర్ ధావన్
ఐపీఎల్ మెగావేలం సందర్భంగా వేలంలోకి తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్ వచ్చాడు. అతని కోసం పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య భారీ పోటీ నెలకొంది. ఇక ధావన్ కనీస ధర. రూ.2 కోట్లతో ఈసారి వేలంలో బరిలోకి దిగాడు.రూ.8.25 కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
మెగా వేలం... ఎవరి పర్సులో ఎంత ఉందంటే!
రిటెన్షన్ నేపథ్యంలో 8 ఫ్రాంఛైజీల పర్సులో మిగిలిన మొత్తం:
ఢిల్లీ క్యాపిటల్స్- 47.5 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్- 48 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 57 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్- 48 కోట్లు
ముంబై ఇండియన్స్- 48 కోట్లు
పంజాబ్ కింగ్స్- 72 కోట్లు
రాజస్తాన్ రాయల్స్- 62 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్- 68 కోట్లు
మెగా వేలం.. సర్వం సిద్ధం
రేసు గుర్రాల్లాంటి ఆటగాళ్లను దక్కించుకునే క్రమంలో ఫ్రాంఛైజీలు ఐపీఎల్ మెగా వేలం-2022కు సిద్ధమయ్యాయి. బెంగళూరు వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్లో చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పంజాబ్, రాజస్తాన్ సహా కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ వేలంలో పోటీ పడనున్నాయి.
Excitement Levels Going 🆙
— IndianPremierLeague (@IPL) February 12, 2022
How excited are you to witness your favourite team in #TATAIPLAuction 2022❓ 🤔
Drop a comment below 🔽 & let us know 👍👍 pic.twitter.com/zK8TskqlxX
Related News By Category
Related News By Tags
-
IPL 2022 Auction Day 1: తొలి రోజు.. 74 మంది ప్లేయర్లు... రూ. 388 కోట్లు!
బెంగళూరు: పది మంది మార్క్యూ ఆటగాళ్ల జాబితాతో తొలి రోజు వేలం మొదలైంది. అందరికంటే ముందుగా శిఖర్ ధావన్ పేరు వచ్చింది. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ (కనీస ధర) విలువ నుంచి రాజస్తాన్ రాయల్స్ ముందుకు తీసుకెళ...
-
IPL Auction: శ్రేయస్ అయ్యర్‌కు 12.25 కోట్లు, ధావన్ 8.25 కోట్లు... వార్నర్‌కు తక్కువే!
IPL 2022 Auction: Shreyas Iyer Most Expensive Ashwin Low Marquee Players: ఐపీఎల్ మెగా వేలం-2022 ఆరంభమైంది. అగ్రశ్రేణి ఆటగాళ్ల (మార్కీ ప్లేయర్లు) జాబితాలో మొదటి వరుసలో ఉన్న టీమిండియా వెటరన్ ఓపెనర్ శ...
-
IPL 2022 Mega Auction: వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయేది వీళ్లే!
IPL 2022 Mega Auction News: ఐపీఎల్ ప్రేమికులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. క్యాష్ రిచ్ లీగ్ మెగా వేలం-2022 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్...
-
IPL 2022: పాపం ధావన్... తన తప్పు లేకున్నా తన్నులు తిన్నాడు!
IPL 2022: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న గబ్బర్ ఎప్పటికప్పుడు తనకు సంబంధ...
-
ఐపీఎల్లో అదరగొట్టాడు.. టీమిండియాలో నో ఛాన్స్.. పాపం ధావన్..!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు సెలెక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ధావన్‌కు చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్-2022లో అద్భతంగా రాణించిన ధావన...
Comments
Please login to add a commentAdd a comment