ఐపీఎల్ మెగావేలం 2022కు రెండు రోజులు మాత్రమే మిగిలిఉంది. మొత్తం 590 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఏ ఆటగాడు ఏ ఫ్రాంచైజీకి వెళతాడు.. ఎంతకు అమ్ముడుపోతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఐపీఎల్‌లో అదనంగా రెండు జట్లు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న 8 జట్లకు తోడూ లక్నో సూపర్‌జెయింట్స్, అహ్మదాబాద్ టైటాన్స్ చేరడంతో మొత్తం ఫ్రాంచైజీల సంఖ్య 10కి చేరింది.
కాగా ఇందులో ఆరు జట్లకు సంబంధించి.. స్పాన్సర్లు, జెర్సీలు మారే అవకాశాలు ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పాన్సర్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇక మిగిలిన ఆరు జట్లు సీఎస్‌కే, ముంబై ఇండియన్స్, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్‌జెయింట్స్, అహ్మదాబాద్(గుజరాత్ టైటాన్స్)ల స్పాన్సర్స్, జెర్సీలు కొత్తగా రానున్నాయి. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగావేలం జరగనుంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం..
సీఎస్‌కే- టీవీఎస్ యూరోగ్రిప్
ముంబై ఇండియన్స్- స్లైస్
ఎస్‌ఆర్‌హెచ్- కార్స్24
లక్నో సూపర్‌జెయింట్స్- మై11సర్కిల్
గుజరాత్ టైటాన్స్(పరిశీలనలో స్లైస్)
రాజస్తాన్ రాయల్స్(ఖరారు కాలేదు)
పాత స్పాన్సర్స్ కొనసాగనున్న నాలుగు జట్లు..
ఆర్‌సీబీ- ముత్తూట్ ఫిన్‌కార్ప్
ఢిల్లీ క్యాపిటల్స్-జేఎస్‌డబ్య్లూ పెయింట్స్
పంజాబ్ కింగ్స్- ఎబిక్స్ క్యాష్
కోల్‌కతా నైట్‌రైడర్స్-ఎంపీఎల్
ఐపీఎల్ 2022 మెగావేలం ముఖ్య విషయాలు..
►10 ఫ్రాంచైజీలు 33 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి
►ఐపీఎల్ మెగావేంలో భాగంగా మొత్తం రూ.900 కోట్ల బడ్జెట్‌లో ఇప్పటికే రూ.343.7 కోట్లు ఖర్చు చేశారు.
►వేలంలో పాల్గొననున్న 10 ఫ్రాంచైజీల వద్ద మిగిలిన మొత్తం కలిపి రూ.556.3 కోట్లు
►వేలానికి రానున్న 590 మంది ఆటగాళ్లలో 217 స్థానాలకు ఎంపిక చేయనున్నారు.
►ఫిబ్రవరి 12,13 తేదీల్లో 217 స్థానాలకు రూ.556.3 కోట్లతో 590 మంది ఆటగాళ్ల నుంచి ఎంపికచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment