
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం... 11 ఇన్నింగ్స్‌లో మొత్తంగా 85 పరుగులు.. అత్యధిక స్కోరు 32.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2021లో 10 ఇన్నింగ్స్‌లో 263 పరుగులు... కట్‌చేస్తే... ఐపీఎల్ మెగా వేలం-2022లో ఏకంగా 10.75 కోట్లు పలికాడు. పంజాబ్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ భారీ మొత్తం అతడి కోసం ఖర్చు చేసింది. అవును మీరు ఊహించింది నిజమే... ఈ ఉపోద్ఘాతం వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ గురించే!
పెద్దగా ఫామ్‌లో లేనప్పటికీ మంచి ధరకు అమ్ముడు పోయాడు. తనదైన రోజున చెలరేగి ఆడే పూరన్ కోసం వేలంలో హైదరాబాద్ తగ్గేదేలే అంటూ పోటీపడి రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఏ ఆటగాడిగైనా ఇంతకంటే సంతోషం ఏముంటుంది! వేలంలో అమ్ముడుపోయానని తెలియగానే.. సహచర ఆటగాళ్లకు అహ్మదాబాద్‌లో పిజ్జా పార్టీ ఇచ్చాడట పూరన్. కాగా టీమిండియాతో సిరీస్ నేపథ్యంలో భారత్‌లో పూరన్ భారత్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే, బయో బబుల్‌లో ఉన్న కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి హోటల్ రూమ్‌కే పిజ్జాలు తెప్పించి ఆనందం పంచుకున్నాడట.
పాపం.. కరెంట్ షాక్ కొట్టింది!
ఈ విషయం గురించి హోటల్ మేనేజర్ మాట్లాడుతూ... ‘‘బయో బబుల్ కారణంగా బయటి నుంచి భోజనం తెప్పించే వీలు లేదు. మా చెఫ్‌తోనే 15 పిజ్జాలు తయారు చేయించాం. శుభ్రంగా ప్యాక్ చేసి, శానిటైజ్ చేసి అందించాం. అయితే దురదృష్టవశాత్తు పూరన్‌కు చిన్నపాటి ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది. శానిటైజర్‌లో స్వల్పంగా ఆల్కహాల్ ఉంటుంది కదా! బహుశా శానిటైజ్ చేసినపుడు ఆరకపోవడంతో ప్లగ్ పెట్టగానే షాక్ కొట్టినట్లుంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా అహ్మదాబాద్‌లో వన్డే సిరీస్ ముగించుకున్న విండీస్.. బుధవారం నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్ కోసం కోల్‌కతా చేరుకుంది.
చదవండి: IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా! అప్పుడు అలా చేశాం కాబట్టే ఇలా!
IPL 2022 Mega Auction: 23 మంది ఆటగాళ్లతో కూడిన ఆరెంజ్ ఆర్మీ ఇదే..
We got him in the Nick of time, and we can't wait for him to wear the #OrangeArmour. 🧡#OrangeArmy, @nicholas_47 is #ReadyToRise. 🔥#IPLAuction pic.twitter.com/jWQLZ5efKz
— SunRisers Hyderabad (@SunRisers) February 13, 2022
Comments
Please login to add a commentAdd a comment