గుజరాత్ టైటాన్స్ సభ్యులతో హార్దిక్ పాండ్యా(PC: Hardik Pandya Twitter)
IPL 2022- Gujarat Titans: ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్! సుదీర్ఘ కాలంగా వరుస గాయాలతో బాధపడుతూ వచ్చిన టీమిండియా ఆల్‌రౌండర్, టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ప్రకటించింది. అంతేకాదు.. ఎక్కువ సమయం పాటు బౌలింగ్ కూడా చేసిన హార్దిక్ నిర్ణీత స్కోరు సాధించి యో–యో టెస్టులో కూడా ఉత్తీర్ణుడవడం విశేషం.
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘ఎన్‌సీఏలో అతడు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ.. అతడు పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించి.. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలిగాడు. 17 ప్లస్ స్కోరు చేశాడు. నిజానికి నిర్ణీత స్కోరు కన్నా ఇది చాలా ఎక్కువ’’ అని పేర్కొన్నారు. దీంతో అతడు పూర్తిస్తాయిలో ఐపీఎల్-2022 సీజన్‌కు అందుబాటులో ఉండనున్నాడు.
కాగా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యాను రిటెన్షన్ సమయంలో వదిలేసిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో బౌలింగ్ చేయలేకపోవడం, టీ20 ప్రపంచకప్-2021లో విఫలం కావడం పాండ్యా కొంపముంచింది. వరుస గాయాలు అతడి కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి. ఈ క్రమంలో ఎన్‌సీఏలో సుదీర్ఘకాలం పాటు చికిత్స తీసుకున్నాడు.
ఫలితంగా పూర్తి ఫిట్‌నెస్ సాధించి యో-యో టెస్టులో పాసయ్యాడు. ఇక హార్దిక్ ఆటతీరుపై నమ్మకం ఉంచిన గుజరాత్ యాజమన్యాం మెగా వేలానికి ముందే 15 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. హార్దిక్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది కూడా. ఇక సీజన్ ఆరంభ సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
చదవండి: IPL 2022- Suresh Raina: రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు ఐపీఎల్‌లో ఎంట్రీ! అయితే..
Nehraji, the OG! 🔥#SeasonOfFirsts #GujaratTitans pic.twitter.com/YuZSYeAZKF
— Gujarat Titans (@gujarat_titans) March 16, 2022
Comments
Please login to add a commentAdd a comment