ఐపీఎల్ మెగా వేలం-2022(PC: IPL)
IPL 2022 Mega Auction Details: ఐపీఎల్ మెగా వేలం-2022కు రంగం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో బెంగళూరు వేదికగా ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ఇక ఈసారి రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా 10 జట్లు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కార్డ్‌ను వేలం నుంచి తొలగించారు. వేలంలో మరొకరు సొంతం చేసుకున్నా... గత ఫ్రాంచైజీ అంతే మొత్తం ఇచ్చి వారిని తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు కొత్త జట్లకు కూడా ఎంపికలో సమాన అవకాశం ఉండాలనే కారణంగా దీనిని తీసివేశారు.
అసలు వేలం ఎలా జరుగుతుంది?
పది మంది అగ్రశ్రేణి (మార్క్యూ) ఆటగాళ్లు మినహా మిగిలిన వారిని వివిధ విభాగాలు (సెట్)గా విభజించారు. బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్లు కీపర్లు, పేస్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు... ఇలా ఒకదాని తర్వాత మరొక భిన్నమైన సెట్‌ల ప్రకారం వేలం నిర్వహిస్తారు. కనిష్టంగా రూ. 20 లక్షల నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు బేస్‌ప్రైస్‌తో క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు.
49 మంది కనీస విలువ రూ. 2 కోట్లతో వేలం బరిలోకి దిగుతున్నారు. మార్క్యూ ఆటగాళ్ల జాబితాలో అశ్విన్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, షమీ (భారత్), బౌల్ట్ (న్యూజి లాండ్), వార్నర్, కమిన్స్ (ఆస్ట్రేలియా), రబడ, డికాక్, డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా) ఉన్నారు.
చదవండి: IPL 2022 Auction: 10 జట్లు... చేతిలో రూ. 561.50 కోట్లు... బాక్స్‌లు బద్దలు కానున్నాయి...
Comments
Please login to add a commentAdd a comment