![IPL 2022 Auction: Auctioneer Hugh Edmeades Collapsing During Bidding Now Fine - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/12/IPL.jpg.webp?itok=87MbDEY9)
IPL 2022 Auction: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలం-2022లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆక్షనీర్ ఎడ్మెడేస్ కళ్లు తిరిగిపడిపోయాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్‌కు గురయ్యారు. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ కోసం పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో వేలం నిలిపివేశారు.
ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ ఎడ్మెడేస్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చింది. ‘‘ఆక్షనీర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తిరిగి వేలంలో పాల్గొంటారు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. క్రికెట్ ప్రజెంటర్ గౌతమ్ భీమాని సైతం ఎడ్మెడేస్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపాడు. ఆయనకు ఎటువంటి సమస్యలు లేవని పేర్కొన్నాడు. కాగా వేలం తిరిగి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
చదవండి: IPL 2022 Auction: శ్రేయస్ అయ్యర్‌కు 12.25 కోట్లు, ధావన్ 8.25 కోట్లు... వార్నర్‌కు మరీ ఇంత తక్కువా!
Comments
Please login to add a commentAdd a comment