
మెగా వేలం-2022 ఎప్పుడు, ఎక్కడ? లైవ్‌స్ట్రీమింగ్ తదితర వివరాలు:
IPL 2022 Mega Auction- హైడ్రామా.. నరాలు తెగే ఉత్కంఠ... భావోద్వేగాలు కలగలసిన మెగా ఈవెంట్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా వేలానికి సమయం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో క్యాష్ రిచ్ లీగ్ ఆక్షన్ ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం-2022 ఆరంభం కానుంది. ఈసారి కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేరికతో మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఆక్షన్‌లో పాల్గొననున్నాయి.
మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ? లైవ్‌స్ట్రీమింగ్ తదితర వివరాలు:
►ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం
►బెంగళూరులో వేలం నిర్వహణ
►ఫిబ్రవరి 12(శనివారం) 11 గంటలకు వేలం ఆరంభం
►స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం
►డిస్నీ + హాట్‌స్టార్‌లో లైవ్‌స్ట్రీమింగ్
►కొత్తగా రెండు జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రాక
►ఈసారి వేలంలో పాల్గొననున్న 10 ఫ్రాంఛైజీలు
►వేలంలోకి రానున్న 590 మంది క్రికెటర్లు
►228 క్యాప్డ్, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఏడుగురు
►రిటెన్షన్‌లో భాగంగా 33 మందిని అట్టిపెట్టుకున్న ఆయా జట్లు
►మరో 217 మందికి అవకాశం.. పోటీపడుతున్న వారు 590 మంది.
చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్!