క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మెగా వేలం- 2022కు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఆక్షన్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 10 జట్లు ఇందుకోసం సన్నద్ధమవుతున్నాయి. రేసు గుర్రాల్లాంటి ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త క్రీడా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ సహా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తదితర జట్లు మాక్ ఆక్షన్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక మెగా వేలం నేపథ్యంలో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని, లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ ఆయా జట్ల తరఫున రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ధోని ఇప్పటికే చెన్నై చేరుకుని... ఫ్రాంఛైజీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు... గంభీర్‌తో నిరంతరం టచ్‌లో ఉంటూ మెగా వేలానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ... ‘‘జట్టు నిర్మాణం విషయంలో సంజీవ్ గోయెంక సర్ మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అభిమానులు, ఫ్రాంఛైజీని గర్వపడేలా చేస్తాం. గౌతమ్‌తో మాట్లాడుతూనే ఉన్నాను. చర్చలు జరుగుతున్నాయి’’ అని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉండగా... ఆర్సీబీ హెడ్‌కోచ్ సంజయ్ భంగర్ సైతం.... డైరెక్టర్ మైక్ హెసన్‌తో కలిసి చర్చిస్తున్నామని... బిగ్ డేకు తాము సంసిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు.
మెగా వేలం 2022- ఏ ఫ్రాంఛైజీ పర్సులో ఎంత?
ఢిల్లీ క్యాపిటల్స్- 47.5 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్- 48 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 57 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్- 48 కోట్లు
ముంబై ఇండియన్స్- 48 కోట్లు
పంజాబ్ కింగ్స్-72 కోట్లు
రాజస్తాన్ రాయల్స్- 62 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్- 68 కోట్లు
చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్
Comments
Please login to add a commentAdd a comment