IPL 2022: ఏంట్రా ఇది.. ఆరెంజ్‌ పెయింట్‌లో ముంచి తీశారా... హే డిజైన్‌ సక్కగ చేయలే! | IPL 2022: Hilarious Memes Trolls On Sunrisers Hyderabad New Jersey | Sakshi
Sakshi News home page

IPL 2022- SRH: కొత్త జెర్సీ... అరె ఏంట్రా ఇది.. ఆరెంజ్‌ పెయింట్‌లో ముంచి తీశారా... హే డిజైన్‌ సక్కగ చేయలే మావా!

Feb 10 2022 4:16 PM | Updated on Feb 10 2022 4:24 PM

IPL 2022: Hilarious Memes Trolls On Sunrisers Hyderabad New Jersey - Sakshi

సన్‌రైజర్స్‌ న్యూ జెర్సీపై ట్రోల్స్‌(jersey PC: SRH)

IPL 2022- Sunrisers Hyderabad New Jersey: కొత్త సీజన్‌.. కొత్త జెర్సీ మావాస్‌! అంటూ ఊరించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు న్యూ జెర్సీ ఎలా ఉంటుందో బుధవారం రివీల్‌ చేసింది. ఆరెంజ్‌, బ్లాక్‌ కలర్‌లో ఉన్న ఈ జెర్సీపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ జెర్సీలో రస్నా వైబ్స్‌ ఉన్నాయంటూ కొంతమంది సరదాగా కామెంట్స్‌ చేస్తే.. మరికొందరు ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘ఏంట్రా ఇది.. మీ దుంపలు తెగ.. టెస్టు మ్యాచ్‌ జెర్సీని ఆరెంజ్‌ పెయింట్‌లో ముంచి తీశావ్‌.. దీని కన్నా పాత జెర్సీ బాగుంది కదా మాష్టారు.. ’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

ఓ నెటిజన్‌ మాత్రం... ‘‘బాగుంటుంది మచ్చా.. 3డీ సక్కగా చేయలేదు డిజైనర్‌.. అందుకే ఇలా కనిపిస్తోంది’’ అంటూ కేన్‌ మామ(సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌) కొత్త జెర్సీలో ఇలా ఉంటాడు అంటూ ఓ ఫొటో షేర్‌ చేశాడు. ఇక మరికొంత మంది.. ఈ జెర్సీ బిగ్‌బాష్‌ లీగ్‌ జట్టు పెర్త్‌ స్కార్చర్స్‌ జెర్సీని గుర్తు చేస్తోందంటున్నారు. ఆరెంజ్‌ ప్యాంట్‌ ఏంటిరా బాబూ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి కొత్త సిబ్బందితో ముందుకు రానుంది. ఇక మెగా వేలం నేపథ్యంలో కేన్‌ విలియమ్సన్‌ (రూ. 14 కోట్లు), అబ్దుల్‌ సమద్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు), ఉమ్రాన్‌ మలిక్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు)ను రిటైన్‌ చేసుకున్న హైదరాబాద్‌ పర్సులో ఇంకా 68 కోట్లు ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.

చదవండి: Border-Gavaskar Trophy 2020-21: కష్టపడింది నేనైతే.. క్రెడిట్ మరొకరికా..? అజింక్య రహానే సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement