
ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన మెగా వేలంలో చాలా చాకచక్యంగా వ్యవహరించి, టీ20లకు కావాల్సిన అసలుసిసలైన జట్టును ఎంచుకుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా(15 కోట్లు)ను రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్.. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(15 కోట్లు), టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(8 కోట్లు)లను మరో ఇద్దరు డ్రాఫ్టెడ్ ప్లేయర్లుగా ఎంచుకుంది.
వీరిపై ఏకంగా 38 కోట్లు వెచ్చించి మిగతా జట్లలో కాక రేపిన టైటాన్స్.. భారీ హిట్టర్లే టార్గెట్‌గా వేలం బరిలోకి దిగింది. ఫెర్గూసన్ (10 కోట్లు), జేసన్ రాయ్ (2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (3 కోట్లు), మాథ్యూ వేడ్ (2.4 కోట్లు), రాహుల్ తెవాతియా (9 కోట్లు) వంటి విధ్వంసకర వీరులకు రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. మెగా వేలంలో 52 కోట్లు ఖర్చు చేసి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 2022 ఐపీఎల్ ఫైట్‌లో తలపడబోయే గుజరాత్ టైటాన్స్ పూర్తి జాబితా ఇదే..
రిటైన్డ్ ఆటగాళ్లు:
- హార్ధిక్ పాండ్యా(15 కోట్లు)
- రషీద్ ఖాన్(15 కోట్లు)
- శుభ్‌మన్ గిల్(8 కోట్లు)
మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
- లోకి ఫెర్గూసన్ (10 కోట్లు)
- రాహుల్ తెవాతియా (9 కోట్లు)
- మహ్మద్ షమీ (6.25 కోట్లు)
- యశ్ దయాల్ (3.2 కోట్లు)
- ఆర్ సాయ్ కిషోర్ (3 కోట్లు)
- డేవిడ్ మిల్లర్ (3 కోట్లు)
- అభినవ్ సదరంగని (2.6 కోట్లు)
- మాథ్యూ వేడ్ (2.4 కోట్లు)
- అల్జరీ జోసఫ్ (2.4 కోట్లు)
- జేసన్ రాయ్ (2 కోట్లు)
- వృద్ధిమాన్ సాహా (1.9 కోట్లు)
- జయంత్ యాదవ్ (1.70 కోట్లు)
- విజయ్ శంకర్ (1.40 కోట్లు)
- డామినిక్ డ్రేక్స్ (1.10 కోట్లు)
- గురుకీరత్ సింగ్ (50 లక్షలు)
- వరుణ్ ఆరోన్ (50 లక్షలు)
- నూర్ అహ్మద్ (30 లక్షలు)
- దర్శన్ నల్ఖండే (20 లక్షలు)
- ప్రదీప్ సాంగ్వాన్ (20 లక్షలు)
- సాయి సుదర్శన్ (20 లక్షలు)
చదవండి: ఐపీఎల్ 2022: గతేడాది మిస్ అయ్యింది, ఈసారి తగ్గేదేలే.. కేకేఆర్ పూర్తి జట్టు ఇదే..
Comments
Please login to add a commentAdd a comment