దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా పేస్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టాడు. సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌లో భారత్-ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ప్రసిద్ద్.. హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ఘనతతో (5/43) చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ తొలి భాగంలో నామమాత్రపు ప్రదర్శన చేసిన ప్రసిద్ద్.. రెండో భాగంలో రెచ్చిపోయి, హ్యాట్రిక్ సహా చివరి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ప్రసిద్ద్‌తో పాటు స్పిన్నర్ సౌరభ్‌కుమార్ (3/83) కూడా రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా-ఏ 319 పరుగులకు ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్, విధ్వత్ కావేరప్ప తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జీన్ డుప్లెసిస్ సెంచరీతో (106) కదంతొక్కగా.. రూబిన్ హెర్మన్ (95) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత-ఏ జట్టు.. 33 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (14), దేవ్‌దత్ పడిక్కల్ (30) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ప్రదోష్ పాల్ (63), సర్ఫరాజ్ ఖాన్ (50) అజేయ అర్ధసెంచరీలు సాధించి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా సాధ్యపడకపోగా.. ప్రస్తుతం మూడో రోజు రెండో సెషన్ కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే, టీమిండియాతో పాటు భారత-ఏ జట్టు కూడా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. ఓ పక్క టీమిండియా సౌతాఫ్రికా నేషనల్ టీమ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్ ఆడనుండగా.. భారత ఏ జట్టు సౌతాఫ్రికా ఏ టీమ్‌తో మూడు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి అనధికారిక టెస్ట్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిపోయిన ప్రసిద్ద్.. భారత ఏ జట్టుతో పాటు రెగ్యులర్ టెస్ట్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఈ అనధికారిక సిరీస్ అయ్యాక ప్రసిద్ద్ టీమిండియాతో జతకట్టనున్నాడు. ఈ ప్రదర్శనతో ప్రసిద్ద్ సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.
టెస్ట్ సిరీస్..
- డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్)
- 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్)
Comments
Please login to add a commentAdd a comment