![IND VS IRE 1st T20: Jasprit Bumrah Is The 4th Indian Bowler To Take 2 Wickets In First Over - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/18/Untitled-10_0.jpg.webp?itok=EfXpIaFz)
Ireland vs India, 1st T20I- Two wickets in the first over for India in a T20I: దాదాపుగా ఏడాది తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. వచ్చీ రాగానే తనదైన మార్కు చూపించాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో మునుపటి కంటి అధికమైన జోష్‌తో తొలి బంతిని సంధించిన బుమ్రా.. ఆ బంతికి బౌండరీని సమర్పించుకున్నాడు. రెండో బంతిని తొలి బంతి కంటే వేగంగా సంధించిన బుమ్రా ఈసారి సక్సెస్ సాధించి, వికెట్ తీసుకున్నాడు.
బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికి ఫోర్ కొట్టిన ఆండ్రూ బల్బిర్నీ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని క్లీన్ బౌల్డయ్యాడు. అదే ఓవర్‌లో బుమ్రా మరో వికెట్ కూడా తీసుకున్నాడు. ఐదో బంతికి టక్కర్.. వికెట్ల వెనుక సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు పడగొట్టిన క్రమంలో బుమ్రా ఓ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2016లో శ్రీలంకపై అశ్విన్ తొలిసారి తొలి ఓవర్‌లో 2 వికెట్లు పడగొట్టగా.. 2022లో ఆఫ్ఘానిస్తాన్‌పై భువనేశ్వర్ కుమార్, ఇదే ఏడాది వెస్టిండీస్‌పై హార్ధక్ పాండ్యా, తాజాగా బుమ్రా ఈ ఘనత సాధించారు.
కాగా, ఈ మ్యాచ్‌లో బుమ్రా తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు పడగొట్టిన అనంతరం డెబ్యూ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన తొలి ఓవర్‌లోనే (5వ ఓవర్) ఓ వికెట్ పడగొట్టాడు. ఐదో ఓవర్ ఆఖరి బంతికి ప్రసిద్ధ్ టెక్టార్‌కు ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే భారత్‌కు మరో వికెట్ దక్కింది.
రవి బిష్ణోయ్.. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 7వ ఓవర్‌లో ప్రసిద్ద్ మరో వికెట్ పడగొట్టాడు. ఈ ఓవర్ మూడో బంతికి గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి డాక్రెల్ ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఐర్లాండ్ స్కోర్ 35/5గా ఉంది. మార్క్ అదైర్ (4), కర్టిస్ క్యాంఫర్ (2) క్రీజ్‌లో ఉండగా.. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ తలో 2 వికెట్లు, బిష్ణోయ్ ఓ వికెట్ పడగొట్టారు.
What a start from the #TeamIndia captain 🤩
— JioCinema (@JioCinema) August 18, 2023
Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo
Comments
Please login to add a commentAdd a comment