టీమిండియా ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, టీ20 నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్, ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఆటకు దూరంగా ఉన్నారు.
వీళ్లంతా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. మరోవైపు... వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత.. చీలమండ నొప్పితో జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగనున్న తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో అతడికి స్థానం దక్కలేదు.
ఈ క్రమంలో తాజాగా టీమిండియా మరో బౌలర్ గాయపడ్డాడు. యువ పేసర్ ప్రసిద్ కృష్ణ తొడ కండరాల నొప్పితో ఆటకు దూరం కావడం గమనార్హం. కాగా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక బౌలర్.. రెండు మ్యాచ్‌లు ఆడి ధారాళంగా పరుగులు ఇచ్చుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.
సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో తిరిగి దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించిన ప్రసిద్ కృష్ణ.. రంజీ ట్రోఫీ-2024లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా కర్ణాటక- గుజరాత్ మధ్య శుక్రవారం మొదలైన టెస్టులో అతడు బరిలోకి దిగాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 14.5 ఓవర్లు బౌల్ చేసిన ప్రసిద్ రెండు వికెట్లు తీశాడు. అయితే, పదిహేనో ఓవర్ ఆఖరి బంతి వేసేపుడు తొడ కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ రైటార్మ్ పేసర్ మైదానాన్ని వీడాడు.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకోవడానికి సుమారు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టనుంది. దీంతో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు.
ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. పేస్ దళంలో జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రసిద్ కృష్ణ మాత్రం గాయం కారణంగా మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఆడకపోవచ్చు.
చదవండి: Ind vs Eng: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ..
Comments
Please login to add a commentAdd a comment