మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా విండీస్‌తో రేపు (జులై 24) జరుగబోయే రెండో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిధ్య జట్టును 3 పరుగుల తేడాతో ఓడించిన ధవన్ సేన.. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం టీమిండియా తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో వికెట్ లేకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిధ్ కృష్ణ స్థానంలో మరో పేసర్ ఆవేశ్ ఖాన్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డేలో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించే ఛాన్స్ ఉంది. ఓపెనర్లుగా ధవన్, గిల్, వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, మిడిలార్డర్‌లో సూర్యకుమార్, దీపక్ హుడా, సంజూ శాంసన్, ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, ఏకైక స్పిన్నర్‌గా చహల్, పేసర్లుగా ఆవేశ్ ఖాన్, సిరాజ్‌లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. మరోవైపు తొలి వన్డేలో దాదాపు విజయపు అంచుల వరకు వచ్చిన విండీస్ సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలగా ఉంది.
భారత తుది జట్టు (అంచనా)..
శిఖర్ ధవన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్
చదవండి: అసలు అతడికి ఇక్కడ ఏం పని? ధావన్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Comments
Please login to add a commentAdd a comment