ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐపీఎల్ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022 చరమాంకంలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ 14 నెలల రీహ్యాబ్ అనంతరం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని బీసీసీఐ సర్టిఫై చేసింది. పంత్ బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపర్‌గానూ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ ధృవీకరించింది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.
BCCI update on Rishabh Pant. pic.twitter.com/LnprCkgJ0v
— CricTracker (@Cricketracker) March 12, 2024
బీసీసీఐ ఇచ్చిన సర్టిఫికెట్‌తో పంత్‌కు రానున్న ఐపీఎల్ సీజన్ ఆడేందుకు మార్గం సుగమం అయ్యింది. పంత్ బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపింగ్ కూడా చేయగలడిన బీసీసీఐ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోతున్నాయి. పంత్ ఐపీఎల్ 2024లో ఆడతాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, వికెట్‌కీపింగ్ చేస్తాడా లేదా అన్న విషయమై సందిగ్దత నెలకొని ఉండింది. బీసీసీఐ తాజా ప్రకటనతో అభిమానుల అనుమానాలన్నీ తొలగిపోయాయి. రీఎంట్రీలో పంత్ మునపటిలా చెలరేగుతాడో లేదో వేచి చూడాలి.
🚨NEWS🚨
— CricTracker (@Cricketracker) March 12, 2024
Rajasthan Royals pacer Prasidh Krishna underwent surgery on his left proximal quadriceps tendon and will miss IPL 2024.
Mohammed Shami had surgery for his right heel problem and will take no part in IPL 2024
📸: BCCI#IPL2024 pic.twitter.com/0WBQsma9jI
పంత్ గురించి అప్‌డేట్ ఇచ్చే సందర్భంగానే బీసీసీఐ మరో ఇద్దరు ఆటగాళ్ల గురించి కూడా ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే సర్జరీ చేయించుకున్న రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అలాగే చీలిమండ సర్జరీ చేయించుకున్న గుజరాత్ టైటాన్స్ పేసర్ మొహమ్మద్ షమీ కూడా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment