
న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లోనే స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. దీనికంటే ముందు పూర్తిస్థాయి సన్నద్ధత కోసం ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరుగనుంది. అంటే ఆసియా కప్‌కు ఎంపికయ్యే జట్టే దాదాపు వన్డే ప్రపంచకప్‌లో ఆడుతుందన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో నేడు ఆసియా కప్‌లో పాల్గొనే జట్టు కోసం సీనియర్ సెలక్షన్ కమిటీ కీలక సమావేశం జరుగనుంది.
ఇందులో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొంటారని బోర్డు వర్గాలు తెలిపాయి. గాయాల నుంచి కోలుకున్న స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్, అదనపు పేసర్‌గా శార్దుల్ ఠాకూర్ లేదంటే ప్రసిధ్ కృష్ణలలో ఎవరికి అవకాశమివ్వాలనే అంశాలపై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ చర్చించనుంది. సోమవారం ప్రకటించే భారత జట్టే ప్రపంచకప్‌కు ప్రొవిజనల్ జట్టుగా దాదాపు ఖాయమయ్యే అవకాశముంది.
చదవండి: IND vs IRE: రుతురాజ్, సామ్సన్ మెరుపులు.. సిరీస్ మనదే