PC: twitter
ఆస్ట్రేలియాతో వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో మాత్రం ఓటమి చవిచూసింది. బ్యాటర్లు అద్బుతంగా రాణించినప్పటికి బౌలర్లు విఫలమకావడంతో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా సిద్దమైంది. శుక్రవారం(డిసెంబర్ 1)న రాయ్‌పూర్ వేదికగా ఆసీస్‌తో నాలుగో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో నాలుగో టీ20లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగననున్నట్లు తెలుస్తోంది. మూడో టీ20కు దూరమైన ముఖేష్ కుమార్ నాలుగో మ్యాచ్‌కు అందుబాటులో రానున్నాడు. అతడితో పాటు సిరీస్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన మరో పేసర్ దీపక్ చాహర్‌కు నాలుగో టీ20 తుది జట్టులో చోటు దక్కనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో మూడో టీ20లో విఫలమైన ప్రసిద్ద్ కృష్ణ, అవేష్ ఖాన్‌ను బెంచ్‌కే పరిమితం చేయాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్, స్టోయినిష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్ స్వదేశానికి పయనమయ్యారు. వారి స్ధానంలో జోష్ ఫిలిఫ్స్, బెన్ మెక్‌డార్మెట్, క్రిస్ గ్రీన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
భారత తుది జట్టు(అంచనా)
భారత్: యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్
Comments
Please login to add a commentAdd a comment