PC: Twitter/ BCCI
భారత జట్టు సారథిగా తొలిసారి వ్యవహరిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. తన కెప్టెన్సీ స్కిల్స్‌తో అందరని అకట్టుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ల గైర్హజరీలో యవ భారత జట్టుకు సూర్య సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20లో 44 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. అంతకుముందు విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ రెండు విజయాల్లోనూ నాయకుడిగానే కాకుండా బ్యాటర్‌గా కూడా సూర్యకుమార్ కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో 80 పరుగులతో సత్తాచాటిన సూర్య... రెండో టీ20లో కీలకమైన 19 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టీ20 ముగిసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌పై భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐసీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ మాట్లాడుతూ.. "సూర్యకుమార్ బ్యాటింగ్ చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అది అతడి కెప్టెన్సీలో కన్పిస్తోంది. సూర్య జట్టులోని ఆటగాళ్లను నమ్ముతాడు. మా ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రతీ ఒక్కరికి పూర్తి స్వేచ్చను ఇస్తాడు. పొరపాటున ఏదైనా తప్పు జరిగినా సరే తను సపోర్ట్‌గా ఉంటాడు. ఒక నాయకుడిగా ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని సూర్యలో ఉన్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో జట్టులో భాగంగా ఉండటం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను చెప్పుకొచ్చాడు.
చదవండి: రోహిత్, కోహ్లి ఓపెన్‌గా మాట్లాడితేనే: టీమిండియా మాజీ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment