PC: Disney+hotstar
టీమిండియాతో తొలి టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సెంచూరియన్‌లో వర్షం కారణంగా టాస్ అరంగటకు పైగా ఆలస్యమైంది. ఇక ఈ మ్యాచ్‌తో భారత యువ పేసర్ ప్రసిద్ కృష్ణ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
మరోవైపు.. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయాలను భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా వెల్లడించాడు. జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లతో పాటు ప్రసిద్‌కు చోటిచ్చినట్లు వెల్లడించాడు.
కాగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటను దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో ప్రసిద్ కృష్ణకు మార్గం సుగమమైంది. వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా అతడు టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు.
సౌతాఫ్రికా- టీమిండియా తొలి టెస్టు.. తుదిజట్లు ఇవే:
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
సౌతాఫ్రికా
డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, తెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెరెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, నాండ్రే బర్గర్.
Comments
Please login to add a commentAdd a comment