స్పీకర్ మధుసూదనాచారి
గణపురం : బంగారు తెలంగాణ సాధనకు అందరి సహకారం అవసరమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఇంజనీర్ల కాలనీలో నూతనంగా నిర్మించిన క్వార్టర్లను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త భవనాలను చూసి మురిసిపోవద్దని, పనిలో కూడా అదే జోరు చూపించాలన్నారు. లక్ష్యంలో 600 మెగావాట్ల ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడే ఇంజనీర్ల అంకితభావం తెలిసిపోతుందని అన్నారు. కేటీపీపీ దేశంలోనే విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థల్లో రెండో స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు.
గ్రామాల్లో బస్ షెల్టర్లు, బస్టాండ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అన్నారు. 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అనంతరం కేటీపీపీ ఉద్యోగులు స్పీకర్‌ను గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెన్‌కో డెరైక్టర్ రాధాకృష్ణ, సీఈ శివకుమార్, జెడ్పీ టీడీపీ ఫ్లోర్ లీడర్ మోటపోతుల శివశంకర్‌గౌడ్, ఎంపీపీ పోతారపు శారద, సర్పంచ్ కొత్త పద్మ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు భైరగాని సరిత, దాసరి రవీందర్, ఎస్‌ఈలు, ఈఈలు, ఏడీఈలు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ టీడీపీ ఫ్లోర్ లీడర్ నిరసన
క్వార్టర్ల ప్రారంభోత్సవానికి ఏర్పాటుచేసిన శిలాఫలకంపై జె డ్పీ టీడీపీ ఫ్లోర్ లీడర్, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీల పేర్లు లేకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కేటీపీపీ సీఈ శివకుమార్‌ను ఫ్లోర్ లీడర్ శివశంకర్‌గౌడ్ నిలదీశారు. విషయూన్నికలెక్ట ర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా జెన్‌కో డెరైక్టర్ పేరు కూడాచేర్చకపోవడంపట్ల కొం దరు కేటీపీపీ అధికారుల్లో నిరసన వ్యక్తమైంది.
బంగారు తెలంగాణకు సహకరించాలి
Published Tue, Mar 31 2015 2:04 AM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM
Advertisement