Gold Telangana
-
బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలి
మద్దూరు : బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సినీ హీరో తల్వార్ సుమన్ అన్నారు. మండలంలోని లింగాపూర్‌లో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజ లింగంగౌడ్‌తో కలిసి బుధవా రం ఆయన మెుక్కలు నాటారు. విస్తృతంగా చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాల న్నారు. విద్యుత్‌ను, నీటిని వృథా చేయవద్దన్నారు. కార్యక్రమంలో లింగాపూర్, ధూల్మిట్ట సర్పంచ్‌లు సర్పంచ్ సందిటి లక్ష్మి, నాచగోని పద్మ, ఎస్సై తిరుపతి, ఏఎస్సై విల్సన్పాల్గొన్నారు. తల్లిదండ్రుల సేవలు మరువద్దు.. తల్లిదండ్రుల సేవలను మరువకూడదని సుమన్‌గౌడ్ అన్నారు. లింగాపూర్‌లో నలగొప్పుల సాయన్నగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎంఈఓ నలగొప్పుల సాయన్నగౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నలగొప్పుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ.. తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ పలువురికి సేవలు అందిస్తున్న సాయన్నగౌడ్ కుమారులను అభినందించారు. అనంతరం మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విధ్యార్థులకు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో సాయన్నగౌడ్ ట్రస్ట్ చైర్మన్ నలగొప్పుల రాజుగౌడ్, ట్రస్ట్ గౌరవాధ్యక్షురాలు లక్ష్మి, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతల వజ్రంగౌడ్, ఉపసర్పంచ్ కోరండ్ల రామయ్య, కాంగ్రెస్, టీడీపీ మండలాధ్యక్షులు బండి చంద్రయ్య, ఆకుల ప్రభాకర్, సీపీఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి, ట్రస్ట్ సభ్యులు టీ.వీ.నారామణ, స్వర్గం లక్ష్మయ్య, సింగబట్టు రామరాజు, కనుకయ్య, అయిలయ్య పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణలో రైతు ఆత్మహత్యలా?
- రైతుల ఆత్మహత్యలపై చర్చకు కేసీఆర్ సిద్ధమా? - ఆదుకోలేక అడ్డగోలు విమర్శలు: కిషన్‌రెడ్డి - ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలతో ధర్నా సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు ఆత్మహత్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఇందిరాపార్కు దగ్గర మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో కలసి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన రైతు దీక్షలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలు, రుణమాఫీపై బహిరంగ చర్చకు సీఎం కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో కొత్త రుణాలు దొరకక.. మరోవైపు తీవ్ర కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నుంచి రైతులను కాపాడాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరితే రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీపై అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు చేతనైతే ఆత్మహత్యలు ఆపాలని కిషన్‌రెడ్డి సూచించారు. ధనిక రాష్ట్రంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, అండగా ఉంటానని సీఎం కేసీఆర్ రైతులకు ఎందుకు భరోసా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులు చేయడం, బెదిరింపులు, వేధింపులతో ఇతరపార్టీల ఎమ్మెల్యేలను, స్థానిక ప్రజా ప్రతినిధులను పార్టీలోకి చేర్చుకోవడంపైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. నేను నాకుటుంబం, నేను నా పార్టీ అనేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంట రుణాలను ఏకకాలంలో చెల్లించాలని, కొత్త రుణాలను బ్యాంకుల నుంచి ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే టీఆర్ఎస్కు తప్పదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నేతలు సుగుణాకర్‌రావు, మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో ఆత్మహత్యలు చేసుకున్న 34 మంది రైతులకు సంబంధించిన కుటుంబాలు దీక్షలో పాల్గొన్నాయి. -
బంగారు తెలంగాణకు సహకరించాలి
స్పీకర్ మధుసూదనాచారి గణపురం : బంగారు తెలంగాణ సాధనకు అందరి సహకారం అవసరమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఇంజనీర్ల కాలనీలో నూతనంగా నిర్మించిన క్వార్టర్లను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త భవనాలను చూసి మురిసిపోవద్దని, పనిలో కూడా అదే జోరు చూపించాలన్నారు. లక్ష్యంలో 600 మెగావాట్ల ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడే ఇంజనీర్ల అంకితభావం తెలిసిపోతుందని అన్నారు. కేటీపీపీ దేశంలోనే విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థల్లో రెండో స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు. గ్రామాల్లో బస్ షెల్టర్లు, బస్టాండ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అన్నారు. 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అనంతరం కేటీపీపీ ఉద్యోగులు స్పీకర్‌ను గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెన్కో డెరైక్టర్ రాధాకృష్ణ, సీఈ శివకుమార్, జెడ్పీ టీడీపీ ఫ్లోర్ లీడర్ మోటపోతుల శివశంకర్‌గౌడ్, ఎంపీపీ పోతారపు శారద, సర్పంచ్ కొత్త పద్మ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు భైరగాని సరిత, దాసరి రవీందర్, ఎస్ఈలు, ఈఈలు, ఏడీఈలు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ టీడీపీ ఫ్లోర్ లీడర్ నిరసన క్వార్టర్ల ప్రారంభోత్సవానికి ఏర్పాటుచేసిన శిలాఫలకంపై జె డ్పీ టీడీపీ ఫ్లోర్ లీడర్, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీల పేర్లు లేకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కేటీపీపీ సీఈ శివకుమార్‌ను ఫ్లోర్ లీడర్ శివశంకర్‌గౌడ్ నిలదీశారు. విషయూన్నికలెక్ట ర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా జెన్కో డెరైక్టర్ పేరు కూడాచేర్చకపోవడంపట్ల కొం దరు కేటీపీపీ అధికారుల్లో నిరసన వ్యక్తమైంది. -
బంగారు తెలంగాణకు అందరూ సహకరించాలి: స్వామిగౌడ్
హిమాయత్‌నగర్: బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని శాసనమండలి చైర్మన్ కె.స్వామి గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో పాత్రికేయులు కూడా కీలక పాత్రే పోషించారన్నారు. శనివారం హిమాయత్‌నగర్‌లో ‘లిబర్టీ మీడియా సెంటర్’ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సగటు మనిషి ఆశలు, ఆలోచనలకు వారధిగా...లిబర్టీ మీడియా సెంటర్ ఉండాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్రోద్యమం సమయంలో సమాచారం బార్బర్ షాపుల్లో దొరికేదని, వార్తల కోసమే బార్బర్ షాపులకు వెళ్లేవారని గుర్తుచేస్తూ...సామాన్యుడి గళాన్ని, ఆవేదన వ్యక్తీకరణకు ఇలాంటి మీడియా సెంటర్లు కృషి చేయాలని సూచించారు. ప్రతి సమస్యపై లోతైన చర్చ జరగాలని, ఆ చర్చ సారాన్ని బంగారు తెలంగాణ సాకారానికి కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం దగ్గరకు తీసుకుపోవాల్సిన బాధ్యతకూడా మీడియా సంస్థలపై ఉందని గుర్తుచేశారు. బీసీలకు రిజర్వేషన్ ఉన్నట్లే ఓసీల్లో అత్యంత దుర్భర జీవితాలను అనుభవించేవారూ ఉన్నారని, అలాంటి వారిని గుర్తించాల్సిన బాధ్యత పభుత్వాలతోపాటు మీడియా పైనా ఉందన్నారు. అవసరమైతే 10 సంవత్సరాలు వయోపరిమితి సడలించి నిరుద్యోగులందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారని, నెల రోజుల్లో నోటిపికేషన్ విడుదల చేస్తామంటున్న టీపీఎస్సీ..ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలని స్వామిగౌడ్ సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు సి.విఠల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మీడియా రోల్ చాలా గొప్పదన్నారు. ఒక సామాజిక కోణంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేసిన లిబర్టీ మీడియా సెంటర్ నిర్వాహకులు అభినందనీయులన్నారు. ‘స్వేచ్ఛ’ అవసరం: ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సాధారణ పౌరుని నుంచి ఉన్నతస్థాయి వ్యక్తి వరకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైందని, ఆ భావ వ్యక్తీకరణకు మీడియాది ప్రముఖమైన భూమిక అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మీడియా అన్నివేళలా ప్రజల పక్షాన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు, బీజేపీ గ్రేటర్ ఉపాధ్యక్షులు జి.రామన్‌గౌడ్, సంఘ సేవకులు రెడ్డి వెంకటేశ్వరెడ్డి, బీజేపీ నగర నాయకులు కేశబోయిన శ్రీధర్, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. -
'బంగారు తెలంగాణ కాదు బాధల తెలంగాణ'
అచ్చంపేట(మహాబూబునగర్): కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బాధల తెలంగాణగా మారిందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికే ఫించన్లు, రేషన్‌కార్డులు అందిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నియోజకవర్గానికి ఇంతమందికి సభ్యత్వం తీసుకోవాలని ప్రజలను బలవంత పెడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటిపన్నులు, నల్లా బిల్లులులను వృద్ధాప్య పింఛన్ల నుంచే వసూలు చేస్తుందని తెలిపారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం అందిస్తానని హామీనిచ్చిన ప్రభుత్వం దొడ్డు బియ్యాన్నే సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాధించుకుందామని చెప్పిన కేసీఆర్ పనితీరుతో బాధల తెలంగాణాగా మారిందని ఎద్దేవా చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలనాకాలంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. -
ముందుంది ‘బంగారు తెలంగాణ’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తమ ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ’ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తోందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యోగ, ఉపాధిరంగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు పక్కా ప్రణాళికతో ఉన్నామన్నారు. 68వ స్వాతంత్య్రదిన వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసుపరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ రొనాల్డ్‌రాస్, ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషిలతో కలిసి పోలీ సుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంత రం మంత్రి ప్రసంగం ఇలా సాగింది. జిల్లా ప్ర జలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికారులకు, సమస్త శాఖల ఉ ద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, మీడియా ప్రతినిధులకు, విద్యార్థులకు స్వాతం త్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జూన్ 2న తెలంగాణ రాష్ర్టం ఏర్పడింది. దీంతో యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒక కొత్త సూర్యోదయం కలిగినట్లైంది. అయితే బం గారు తెలంగాణ నిర్మాణం వరకు ఈ ప్రభుత్వం విశ్రమించబోదు. గతంలో ఏ రాష్ట్రాలకు లేని విధంగా అనేక పరిమితులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశనంలో ఈ రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’ గా మార్చగలము. తెలంగాణ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యో గ, ఉపాధిరంగాలపై దృష్టి సారించి జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. మన జిల్లా అధికంగా గ్రామీణ ప్రాంతం కలిగిన వ్యవసాయ ఆధారితమైనది. ఈ సీజన్లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు ఆశాజనంగా లేనప్పటికీ వేసిన పంటలను రక్షించుకునేం దుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 78 వేల 797 క్వింటాళ్ల విత్తనాలను రాయితీపైనా, 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేశాము. వ్యవసాయ యంత్ర పరికరాలు 50 శాతం రాయితీపైన అందించేందుకు రూ. 17 కోట్లు కేటాయించాము. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసా ల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటనష్టపోయిన 14 వేల 644 మంది రైతులకు రూ. 8 కోట్ల 42 లక్షలు ఇన్పుట్ సబ్సిడీ, అలాగే 2010 నుంచి 2014 వరకు ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయిన 51 వేల 106 మంది రైతులకు చెల్లించవలసిన పంట నష్టపరిహారం రూ. 20 కోట్ల 6 లక్షలు విడుదల చేశాము. గతంలో ఆర్మూరులో పోలీసు కాల్పులకు దారి తీసిన రూ.9.50 కోట్ల బకాయిలను రైతులకు చెల్లిం చిన ఘనత కేవలం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికే దక్కుతుంది. ముఖ్యమంత్రి ఆదే శం మేరకు తెలంగాణను విత్తన ఉత్పత్తి రాష్ట్రం గా మార్చటానికి చర్యలు చేపడుతున్నాము. జిలా ్లలో బోరు మోటార్ల కింద వేసిన పంటలకు ఏడు గంటల పాటు కరెంటు సరఫరా చేస్తాము. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్లు 17 మంజూరు చేశా ము. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయిస్తాము. మరో 43 సబ్స్టేషన్లు(33/11 కేవీ), మూడు 132/33 కేవీ సబ్స్టేషన్ల కోసం, ఒక 220/122 కేవీ సబ్‌స్టేషన్ మంజూ రుకు ప్రతిపాదనలు పంపాము. నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణకు సుమారు రూ.740 కోట్లతో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. దీంతో చివరి ఆయకట్టు వరకు నీరు అం దించే అవకాశం ఏర్పడుతుంది. 30 ఏళ్లుగా మూలుగుతున్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండిని పూర్తి చేయించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. జిల్లాలోని పోచారం, గుజ్జుల్ ప్రాజెక్టు, గుత్ప ఎత్తిపోతల ద్వారా అదనపు ఆయకట్టుకు నీరిందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2014-15 సంవత్సరానికి జిల్లాలో విద్యార్థులకు అవసరమైన 15 లక్షల 37 వేల 482 పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తయ్యింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన జిల్లాలోని వైద్య కళాశాలలో 100 మంది విద్యార్థులు రెండవ సంవత్సరం వైద్య కొనసాగించేందుకు భారతీయ మెడికల్ కౌన్సిల్ అనుమతించింది. మౌలిక వసతుల కల్పనకు రూ. 63 కోట్ల మం జూరుకు చర్యలు తీసుకుంటున్నాము. రహదారుల నిర్మాణం, తాగునీటి పథకాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్మూర్ పట్టణానికి తాగునీరు అందించేందుకు రూ. 114 కోట్ల వ్యయంతో నిర్మించే ప్రాజెక్టునకు ఇటీవలే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును త్వరితంగా పూర్తి చేయించి అక్కడి ప్రజల దాహార్తి తీరుస్తాము. ఎలాంటి రక్షిత మంచినీటి సరఫరా లేని జిల్లాలోని 139 ఆవాస ప్రాంతాలకు రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. డిచ్పల్లి నుంచి బోధన్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తున్నాము. ఎనిమిది గ్రామాల ప్రజలకు ఉపయోపడేలా జక్రాన్‌పల్లి మండలం లక్ష్మాపూర్ నుంచి అంకాపూర్ వరకు రూ. కోటి 70 లక్షలతో రోడ్డు నిర్మాణానికి మంజూరు ఇచ్చాము. నిజామాబాద్ నగరంలో రింగు రోడ్డు పనులు వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. జిల్లా పాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్ నూతన కార్యాలయ భవన సముదాయ నిర్మాణానికి సరికొత్త ప్రణాళిక తయారవుతోంది. ప్రభుత్వ పథకాలు హైదరాబాద్‌లో కూర్చుని తయారు చేయడం వల్ల అనుకున్న ఫలితాలు రావట్లేదని భావించిన సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం ప్రవేశపట్టారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలు, 36 మండల పరిషత్‌లు, మూడు పురపాలక సంఘాలు, ఒక మున్సిపాల్ కార్పొరేషన్, జిల్లా పరిషత్‌లలో సభలు నిర్వహించి ప్రజా ప్రతినిధుల ఆమోదంతో ప్రణాళికలు రూపొందించాము. ఈ ప్రణాళికలో భాగంగా 5 వేల 318 పనులను రూ.6,899 కోట్లతో చేపట్టేం దుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చాము. ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేకపోవడం వల్లే పథకాలు దుర్వినియోగమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఎవరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఈనెల 19న ఇంటింటి సర్వే జరుగనుంది.