సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తమ ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ’ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తోందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యోగ, ఉపాధిరంగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు పక్కా ప్రణాళికతో ఉన్నామన్నారు. 68వ స్వాతంత్య్రదిన వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసుపరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కలెక్టర్ రొనాల్డ్‌రాస్, ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషిలతో కలిసి పోలీ సుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంత రం మంత్రి ప్రసంగం ఇలా సాగింది. జిల్లా ప్ర జలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికారులకు, సమస్త శాఖల ఉ ద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, మీడియా ప్రతినిధులకు, విద్యార్థులకు స్వాతం త్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జూన్ 2న తెలంగాణ రాష్ర్టం ఏర్పడింది. దీంతో యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒక కొత్త సూర్యోదయం కలిగినట్లైంది. అయితే బం గారు తెలంగాణ నిర్మాణం వరకు ఈ ప్రభుత్వం విశ్రమించబోదు.
గతంలో ఏ రాష్ట్రాలకు లేని విధంగా అనేక పరిమితులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశనంలో ఈ రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’ గా మార్చగలము. తెలంగాణ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యో గ, ఉపాధిరంగాలపై దృష్టి సారించి జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. మన జిల్లా అధికంగా గ్రామీణ ప్రాంతం కలిగిన వ్యవసాయ ఆధారితమైనది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు ఆశాజనంగా లేనప్పటికీ వేసిన పంటలను రక్షించుకునేం దుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 78 వేల 797 క్వింటాళ్ల విత్తనాలను రాయితీపైనా, 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేశాము. వ్యవసాయ యంత్ర పరికరాలు 50 శాతం రాయితీపైన అందించేందుకు రూ. 17 కోట్లు కేటాయించాము. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసా ల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటనష్టపోయిన 14 వేల 644 మంది రైతులకు రూ. 8 కోట్ల 42 లక్షలు ఇన్‌పుట్ సబ్సిడీ, అలాగే 2010 నుంచి 2014 వరకు ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయిన 51 వేల 106 మంది రైతులకు చెల్లించవలసిన పంట నష్టపరిహారం రూ. 20 కోట్ల 6 లక్షలు విడుదల చేశాము.
గతంలో ఆర్మూరులో పోలీసు కాల్పులకు దారి తీసిన రూ.9.50 కోట్ల బకాయిలను రైతులకు చెల్లిం చిన ఘనత కేవలం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికే దక్కుతుంది. ముఖ్యమంత్రి ఆదే శం మేరకు తెలంగాణను విత్తన ఉత్పత్తి రాష్ట్రం గా మార్చటానికి చర్యలు చేపడుతున్నాము. జిలా ్లలో బోరు మోటార్ల కింద వేసిన పంటలకు ఏడు గంటల పాటు కరెంటు సరఫరా చేస్తాము.
నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్లు 17 మంజూరు చేశా ము. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయిస్తాము. మరో 43 సబ్‌స్టేషన్లు(33/11 కేవీ), మూడు 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ల కోసం, ఒక 220/122 కేవీ సబ్‌స్టేషన్ మంజూ రుకు ప్రతిపాదనలు పంపాము. నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణకు సుమారు రూ.740 కోట్లతో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
దీంతో చివరి ఆయకట్టు వరకు నీరు అం దించే అవకాశం ఏర్పడుతుంది. 30 ఏళ్లుగా మూలుగుతున్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండిని పూర్తి చేయించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. జిల్లాలోని పోచారం, గుజ్జుల్ ప్రాజెక్టు, గుత్ప ఎత్తిపోతల ద్వారా అదనపు ఆయకట్టుకు నీరిందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2014-15 సంవత్సరానికి జిల్లాలో విద్యార్థులకు అవసరమైన 15 లక్షల 37 వేల 482 పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తయ్యింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన జిల్లాలోని వైద్య కళాశాలలో 100 మంది విద్యార్థులు రెండవ సంవత్సరం వైద్య కొనసాగించేందుకు భారతీయ మెడికల్ కౌన్సిల్ అనుమతించింది. మౌలిక వసతుల కల్పనకు రూ. 63 కోట్ల మం జూరుకు చర్యలు తీసుకుంటున్నాము. రహదారుల నిర్మాణం, తాగునీటి పథకాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
ఆర్మూర్ పట్టణానికి తాగునీరు అందించేందుకు రూ. 114 కోట్ల వ్యయంతో నిర్మించే ప్రాజెక్టునకు ఇటీవలే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును త్వరితంగా పూర్తి చేయించి అక్కడి ప్రజల దాహార్తి తీరుస్తాము. ఎలాంటి రక్షిత మంచినీటి సరఫరా లేని జిల్లాలోని 139 ఆవాస ప్రాంతాలకు రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. డిచ్‌పల్లి నుంచి బోధన్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తున్నాము. ఎనిమిది గ్రామాల ప్రజలకు ఉపయోపడేలా జక్రాన్‌పల్లి మండలం లక్ష్మాపూర్ నుంచి అంకాపూర్ వరకు రూ. కోటి 70 లక్షలతో రోడ్డు నిర్మాణానికి మంజూరు ఇచ్చాము.
నిజామాబాద్ నగరంలో రింగు రోడ్డు పనులు వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. జిల్లా పాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్ నూతన కార్యాలయ భవన సముదాయ నిర్మాణానికి సరికొత్త ప్రణాళిక తయారవుతోంది. ప్రభుత్వ పథకాలు హైదరాబాద్‌లో కూర్చుని తయారు చేయడం వల్ల అనుకున్న ఫలితాలు రావట్లేదని భావించిన సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం ప్రవేశపట్టారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలు, 36 మండల పరిషత్‌లు, మూడు పురపాలక సంఘాలు, ఒక మున్సిపాల్ కార్పొరేషన్, జిల్లా పరిషత్‌లలో సభలు నిర్వహించి ప్రజా ప్రతినిధుల ఆమోదంతో ప్రణాళికలు రూపొందించాము.
ఈ ప్రణాళికలో భాగంగా 5 వేల 318 పనులను రూ.6,899 కోట్లతో చేపట్టేం దుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చాము. ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేకపోవడం వల్లే పథకాలు దుర్వినియోగమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఎవరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఈనెల 19న ఇంటింటి సర్వే జరుగనుంది.
ముందుంది ‘బంగారు తెలంగాణ’
Published Sat, Aug 16 2014 3:02 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement