సాక్షి,దామగుండం : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవిలో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్ (వీఎల్‌ఎఫ్) ఏర్పాటుపై అపోహలు వద్దని అన్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. మంగళవారం (అక్టోబర్ 15) రాజ్ నాథ్ సింగ్ నేవీ రాడర్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు.. దేశ భద్రతవేరు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అపోహపడుతున్నారు. పర్యావరణ సంరక్షణలో కేంద్రం దృఢనిశ్చయంతో ఉంది. స్థానికులపై ప్రభావం పడుతుందంటే పునరావాసం’ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
స్థానికులపై వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్‌ఎఫ్)నుంచి ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. స్థానికుల ఆర్థిక ప్రగతికి వీఎల్‌ఎఫ్ దోహదపడుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయిని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment