హైపర్‌ సోనిక్‌ పరీక్ష సక్సెస్‌ | India successfully test fires long range hypersonic missile: Rajnath Singh | Sakshi
Sakshi News home page

హైపర్‌ సోనిక్‌ పరీక్ష సక్సెస్‌

Published Mon, Nov 18 2024 4:39 AM | Last Updated on Mon, Nov 18 2024 4:39 AM

India successfully test fires long range hypersonic missile: Rajnath Singh

చరిత్రాత్మక ఘట్టం: రాజ్‌నాథ్‌ సింగ్‌  

న్యూఢిల్లీ: భారత సైనిక దళాల్లో మరో కీలక అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవిలో దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్‌ క్షిపణిని విజయంతంగా పరీక్షించారు. గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా అత్యధిక వేగంతో దూసుకెళ్లి, శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా మిస్సైల్‌ కలిగి ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్‌ చేరింది.

ఈ పరీక్షను చరిత్రాత్మక ఘట్టంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభివర్ణించారు. క్రిటికల్, అడ్వాన్స్‌డ్‌ మిలటకీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేరామంటూ ßæర్షం వ్యక్తంచేశారు. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకునే విషయంలో కీలక మైలురాయిని అధిగమించామని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. అద్భుతమైన ఘనత సాధించామని ఉద్ఘాటించారు. డీఆర్‌డీఓతోపాటు సైనిక దళాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.

ప్రత్యేకతలేమిటి?  
దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్‌ క్షిపణిని హైదరాబాద్‌లోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మిస్సైల్‌ కాంప్లెక్స్‌లో దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)తోపాటు పలు ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగ సంస్థలు సహకారం అందించాయి. ఇది వివిధ రకాల పేలోడ్స్‌ను 1,500 కిలోమీటర్లకు పైగా దూరానికి మోసుకెళ్లగలదు. ప్రయాణం మధ్యలో దిశను మార్చుకోగలదు. 

 సాధారణంగా హైపర్‌సానిక్‌ మిస్సైల్స్‌ పేలుడు పదార్థాలు లేదా అణు వార్‌హెడ్లను మోసుకెళ్తాయి. ధ్వని వేగం కంటే ఐదు రెట్లు అధిక వేగంతో దూసుకెళ్తాయి. అంటే గంటకు 1,220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.  

 కొన్ని అడ్వాన్స్‌డ్‌ హైపర్‌సోనిక్‌ మిస్సైల్స్‌ ధ్వని వేగం కంటే 15 రెట్లు వేగంతో ప్రయాణిస్తాయి.  
 ప్రస్తుతం రష్యా, చైనా దేశాలు హైపర్‌సోనిక్‌ క్షిపణుల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఫ్రా న్స్, జర్మనీ, ఆ్రస్టేలియా, జపాన్, ఇరాన్, ఇజ్రా యెల్‌ తదితర దేశాలు సైతం ఈ తరహా క్షిప ణుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి.  

చెనా సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాలని ఇండియా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్‌ క్షిపణిని పరీక్షించింది.  
 తదుపరి తరం ఆయుధ వ్యవస్థలు, డ్రోన్లు, కృత్రిమ మేధ(ఏఐ)తో పని చేసే ఆయుధాలు, పరికరాల అభివృద్ధికి భారత్‌ ప్రాధాన్యం ఇస్తోంది.   
 పృథీ్వ, ఆకాశ్, అగ్ని తదితర క్షిపణులను డీఆర్‌డీఓ గతంలో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement