హైదరాబాద్,సాక్షి : కాంగ్రెస్ అవుట్‌డేటెడ్ పార్టీ.. దేశ రాజకీయాల్లో ఉనికిని కోల్పోతుంది అని కేంద‍్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియకు ముందు ఏర్పాటు చేసిన పార్టీ సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు.
‘కాంగ్రెస్ కాలం చెల్లిపోయింది. దేశ రాజకీయాల్లో తన ఉనికిని కోల్పోయింది. బీజేపీ మాత్రం దేశ నిర్మాణం కోసమే రాజకీయాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ఉద్దేశించి, తెలంగాణలోని అధికార పార్టీకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు ఘనత బీఆర్‌ఎస్‌కు కాదని, అనేక మంది త్యాగాల వల్లే దక్కుతుందని సూచించారు.
గత కాంగ్రెస్ హయాంలో అవినీతి ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ..అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాలపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ.. మోదీ నాయకత్వంలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజ్‌గిరి)లకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Secunderabad resonates with #PhirEkBaarModiSarkar
My gratitude to Hon’ble Union Minister for Defence and Senior BJP leader Shri @rajnathsingh for joining & addressing the nomination rally in Secunderabad.
The determination of the people of #Secunderabad in re-electing… pic.twitter.com/9EA3wDwtly
— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) April 19, 2024
బీఆర్‌ఎస్‌ను తరిమి కొట్టినందుకు
గడిచిన పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఒక్క అవినీతి లేకుండా నరేంద్ర మోడీ పాలన చేస్తున్నాడని కేంద్ర క్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. ఖమ్మం బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహించారు. ఖమ్మం నగరంలోని జెడ్.పీ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి ప్రభుత్వాలే
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి ప్రభుత్వాలే అని విమర్శించారు. ఈ ప్రభుత్వాల హయాంలో రైతులను మోసం చేసి యూరియా కుంభకోణం చేశాయని,రైతులపై భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు మోదీ ఆర్ధిక సాయం చేశారన్నారు.
కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని అమలు చేశామని గుర్తు చేశారు.మహిళలకు సమాన హక్కుల కోసం మోదీ ప్రభుత్వం చట్టాలను చేసిందన్నారు. ముస్లింల కోసం త్రిపుల్ తలాకును తొలగించామని,మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. బీజేపి అధికారంలోకి రాగానే దేశంలో ఓకే పౌరసత్వాన్ని తీసుకురాబోతున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానిగా పనిచేసినప్పుడు పేదరికం తొలగిస్తామన్నారు కానీ ఇప్పటికీ పేదరికం అలానే ఉందన్నారు రాజ్ నాధ్ సింగ్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తెలుగు ప్రజలను 22 వేల మందికి పైగా విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీ దన్నారు.బీజేపిని గెలిపించి మూడోసారి మోదీని ప్రధాన మంత్రిని చేద్దామని ఖమ్మం ప్రజలు కూడా బీజేపిని ఆదరిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment