న్యూఢిల్లీ: ఒడిశా సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒడిశా బీజేపీ కీలక నేత మాజీ కేంద్ర మంత్రి నేత ధర్మేంద్ర ప్రదాన్‌కు మోదీ3.0 కేబినెట్‌లో మళ్లీ బెర్త్ దక్కింది. దీంతో సీఎం రేసు నుంచి ఆయన తప్పుకున్నట్లయింది. మిగిలిన సీనియర్ నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు.
సీఎం ఎవరనేది తేల్చడానికి బీజేపీ హైకమాండ్ ఇద్దరు అగ్రనేతలను సోమవారం(జూన్10) పరిశీలకులుగా నియమించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు భూపేందర్‌యాదవ్‌కు ఈ పని అప్పగించింది. 11న భువనేశ్వర్‌లో ఒడిషా బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 12న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారని ఒడిషా బీజేపీ ఇంఛార్జ్ విజయ్‌పాల్‌సింగ్ తోమర్ తెలిపారు.
సీఎం పదవి రేసులో బ్రజరాజ్‌నగర్ ఎమ్మెల్యే సురేష్ పూజారీ, బీజేపీ స్టేట్ చీఫ్ మన్మోహన్ సమాల్‌తో పాటు సీనియర్ నేతలు కేవీ సింగ్, మోహన్ మాజీలు ఇప్పటివరకు ముందున్నారు. కాగా, రాష్ట్రంలోని 21 ఎంపీ సీట్లలోనూ బీజేపీ 20 గెలుచుకుంది. వరుసగా 24 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బిజూజనతాదల్‌ను మట్టి కరిపించి బీజేపీ ఒడిశా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment