కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కు ఈటల విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా మహ మ్మారి వేళ కంటోన్మెంట్‌లో పనిచేసిన మున్సి పల్ కార్మికులు సుమారు వంద మందికి పైగా మృతి చెందారు.
ఐదు శాతం కంటే ఎక్కువ మందికి కారుణ్య నియామకాలు చేపట్టవద్దని రక్షణ శాఖ నిబంధన ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించి కరోనా సమయంలో మృతి చెందిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఈటల రాజేందర్ తెలిపారు.
జేసీఓపీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకారం
18వ లోక్‌సభ ‘జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్’ చైర్మన్‌గా సోమవారం ఢిల్లీలోని కార్యాలయంలో ఎంపీ ఈటల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. ఆయనకు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమిటీకి ఈటల చైర్మన్ కాగా.. తొమ్మిదిమంది లోక్‌సభ ఎంపీలు, ఐదుగురు రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment