పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే!
పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే!
Published Wed, Dec 28 2016 12:38 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. 2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది.. ఈ మేరకు ఆర్డినెన్స్ను కేంద్రం నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించింది. డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో లావాదేవీలు జరిపినా రూ.5వేల వరకు జరిమానా విధించేలా ఈ ఆర్డినెన్స్ను ప్రభుత్వం రూపొందించింది. దీంతో పాత నోట్లు కలిగి ఉన్నవారికి గట్టి హెచ్చరికలనే ప్రభుత్వం పంపినట్టు తెలిసింది.
డిసెంబర్ 30 తర్వాత కూడా పాత నోట్లు రూ.500, రూ.1000 బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉంచుకున్నవారిపై లీగల్గా చర్యలు తీసుకునేలా ఈ ఆర్డినెన్స్ను ప్రభుత్వం రూపొందించింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టాన్ని సవరించాలని భావించిన ప్రభుత్వం, గడువు ముగిసిన వెంటనే పార్లమెంట్ సమావేశాలు నిర్వర్తించలేకపోవడంతో ఈ ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది.
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని మోదీ, వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు డిసెంబర్ 30వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. గడువు దగ్గరపడుతుండటంతో పాత నోట్లు కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. రద్దయిన నోట్లు కలిగి ఉన్నవారిపై జరిమానాలు విధించేందుకు ఆర్డినెన్స్ను తీసుకురావాలని అంతకముందే కేంద్రం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ మేరకు బుధవారం కేబినెట్ సమావేశమై, ఆర్డినెన్స్ ను ఆమోదించింది.
Advertisement
Advertisement