noteban
-
నోట్లరద్దుతో సీన్‌రివర్స్..
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో నోట్ల రద్దు చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పేర్కొన్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.గతంతో పోలిస్తే ఎన్నికల్లో బ్లాక్‌మనీ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నికల్లో భారీఎత్తున నగదు వాడకం పెరిగిపోయిందని స్వయంగా ఈసీ అత్యున్నత వర్గాలే వెల్లడించాయి. ఎన్నికల్లో నల్లధన ప్రవాహంపై నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపలేదని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ పెదవివిరిచారు. నోట్ల రద్దు అనంతరం ఎన్నికల్లో నల్లధనం వాడకం తగ్గుతుందనే అభిప్రాయం కలిగినా నగదు స్వాధీనాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పెద్ద మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే నగదు పట్టుబడుతున్న సందర్భాలు ఇప్పుడే అధికంగా ఉన్నాయని రావత్ వెల్లడించారు. ఎన్నికల్లో వాడే నల్లధనంపై ఎలాంటి నియంత్రణ ఉండటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు, వారికి ఆర్థిక వనరులు సమకూర్చే వారికి నగదు కొరత ఎంతమాత్రం లేదన్నారు. ఎన్నికల్లో నగదు వాడకం, సోషల్ మీడియాలను నియంత్రించేలా నూతన మార్గదర్శకాలను జారీ చేసేలా న్యాయమంత్రిత్వ శాఖకు ఈసీ సిఫార్సు చేయకపోవడం బాధాకరమని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా గత వారం పదవీ విరమణ చేసిన రావత్ విచారం వ్యక్తం చేశారు. -
నోట్ల రద్దుపై ప్రకాష్‌రాజ్ సంచలన వ్యాఖ్య
చెన్నై: హిందూ తీవ్రవాదంపై హీరో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలకు తను మద్దతును ప్రకటించిన విలక్షణ నటుడు, చిత్రనిర్మాత ప్రకాష్ రాజ్ బుధవారం నోట్ల రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ ప్రకటించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోషల్‌మీడియాలో ఆయన స్పందించారు. పెద్ద నోట్లను రద్దు చేసి పెద్ద తప్పు చేసిందనీ, దీనికి కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో విశేష ఆదరణ సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఇటీవల బాగా యాక్టివ్ అయ్యారు. ఈ నేపథ్యంలో నోట్ల రద్దుపై కూడా సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యల్నిపోస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. To whomsoever it may concern అనే టైటిల్‌తో ట్విట్టర్లో ఇటీవల వరస పోస్ట్‌లు పెడుతున్న ప్రకాష్‌రాజ్ ఇపుడు నోట్ల రద్దుపై తన ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. నల్లధనాన్ని నిరోధించేందుకు, ఉగ్రవాదులకు నిధులను అడ్డుకునే లక్ష్యంతో నవంబర్ 8, 2016 పెద్దనోట్ల రద్దును ప్రధాన నరేంద్ర మోదీ ప్రకటించారనీ, కానీ ధనికులు అనేక మార్గాల ద్వారా నల్లధనాన్ని కొత్తనోట్లతో మార్చుకుంటే లక్షలాది మంది ప్రజలు నిస్సహాయంగా బాధలుపడ్డారని, అలాగే అసంఘటిత రంగ కార్మికులు భారీ కష్టాలనెదుర్కొన్నారన్నారు. ఇంత పెద్ద తప్పు చేసినందుకు క్షమాపణలు చెపుతారా? అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల బెంగళూరులో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య పై ప్రధాని మోదీ మౌనాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. అలాగే హిందూ తీవ్రవాదంపై హీరో కమల్ హాసన్ అభిప్రాయాలకు మద్దతు పలికి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. This day... that age......#justasking... pic.twitter.com/LzcphBwQkz — Prakash Raj (@prakashraaj) November 8, 2017 -
జీడీపీకి నోట్ల రద్దు, జీఎస్టీ భారీ దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులకు భారీ రీక్యాపిటలైజేషన్‌కు ప్రకటించగా మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ మరింత మందగించనుందని తాజాగా 30 మంది ఆర్థిక వేత్తల అంచనా తేల్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 4 ఏళ్ల కనిష్టానికి పడిపోనుందని అంచనాలు వెలువడ్డాయి. మార్చి 2018 తో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కానుందని అంచనా. నోట్ల రద్దు, కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ కారణంగా వ్యాపార కార్యకలాపాలు, వినియోగదారుల డిమాండ్ భారీగా క్షీణించనుందని రాయిటర్స్ పోల్ లో వెల్లడైంది 2014-15ఆర్థిక సంవత్సరంలో పరిచయం చేసిన కొత్త విధానం ప్రకారం భారత స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)వృద్ధి రేటు.. 2018 మార్చ్‌తో ముగిసిన కాలానికి 6.7 శాతంగా నమోదు కావచ్చంటూ రాయిటర్స్ పోల్ లో తేలింది. ఇది గత నాలుగేళ్లలో అత్యంత కనిష్టం. అక్టోబర్ 12-124మధ్య నిర్వహించిన 30 మంది ఆర్థికవేత్తల అంచనాలను పరిగణలోకి తీసుకుని రాయిటర్స్ పోల్ ఈ అంచనాలను వెల్లడించింది. ముఖ్యంగా డిమానిటైజేషన తర్వాతి పరిస్థితులు.. ఒకేదేశం ఒకటే పన్ను అంటూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ల కారణంగా బిజినెస్ యాక్టివిటీ, కన్జూమర్ డిమాండ్‌లో విపరీతమైన ఒత్తిడి నెలకొంది. కరెన్సీ నిషేధం, కొత్త వస్తువులు, సేవల పన్ను (జిఎస్టి) వ్యాపార కార్యకలాపానికి అంతరాయం కలిగించి, వినియోగదారుల డిమాండ్ తగ్గడంతో ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత నెమ్మదించి నాలుగు సంవత్సరాల కిందికి దిగజారనుందని తెలిపింది. ఇప్పటికే అభివృద్ధి ఔట్‌లుక్‌పై రిస్క్ తగ్గినా.. కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్‌పై ఒత్తిడి కొనసాగవచ్చని, ప్రైవేట్ క్యాపిటల్ ఖర్చులు తగ్గవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. -
రద్దైన పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే !
-
పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే!
పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. 2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను కేంద్రం నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించింది. డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో లావాదేవీలు జరిపినా రూ.5వేల వరకు జరిమానా విధించేలా ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రూపొందించింది. దీంతో పాత నోట్లు కలిగి ఉన్నవారికి గట్టి హెచ్చరికలనే ప్రభుత్వం పంపినట్టు తెలిసింది. డిసెంబర్ 30 తర్వాత కూడా పాత నోట్లు రూ.500, రూ.1000 బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉంచుకున్నవారిపై లీగల్‌గా చర్యలు తీసుకునేలా ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రూపొందించింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టాన్ని సవరించాలని భావించిన ప్రభుత్వం, గడువు ముగిసిన వెంటనే పార్లమెంట్ సమావేశాలు నిర్వర్తించలేకపోవడంతో ఈ ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని మోదీ, వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు డిసెంబర్ 30వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. గడువు దగ్గరపడుతుండటంతో పాత నోట్లు కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. రద్దయిన నోట్లు కలిగి ఉన్నవారిపై జరిమానాలు విధించేందుకు ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని అంతకముందే కేంద్రం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ మేరకు బుధవారం కేబినెట్ సమావేశమై, ఆర్డినెన్స్ ను ఆమోదించింది.