ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఓకే | President ordinance okay | Sakshi
Sakshi News home page

ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఓకే

Published Thu, Jan 1 2015 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఓకే

ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఓకే

  • భూసేకరణ సవరణలకు ఆమోదం
  • న్యూఢిల్లీ: భూసేకరణ చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించింది. గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టంలో సవరణలతో కేంద్ర మంత్రివర్గం గత నెల 29న ఆమోదించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి బుధవారం ఆమోదముద్ర వేశారు. పారిశ్రామిక కారిడార్లు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, రక్షణ, గృహనిర్మాణ రంగాలకోసం జరిపే భూసేకరణకు సంబంధించిన నిబంధనల్లో మార్పు చేస్తూ తయారు చేసిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపి, రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తూ రాష్ట్రపతి సంతకం చేసినట్టు రాష్ట్రపతి మీడియా కార్యదర్శి   వేణు రాజమొనీ చెప్పారు.
     
    కాగా,  ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిల నియామకానికి ఇప్పటివరకు అనుసరిస్తున్న కొలీజియం విధానం రద్దుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ  బిల్లుకు కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.  పార్లమెంటు ఆమోదించిన జాతీయ న్యాయసంబంధ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
     
    ‘ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో వ్యతిరేకిస్తాం’

    భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌నురాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్  చెప్పింది. ఆర్డినెన్స్ ఉన్నదున్నట్టుగా చట్టం కాజాలదని, పరిస్థితుల ఒత్తిడితో మాత్రమే ఆర్డినెన్స్‌లు తేవాల్సి ఉండగా, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఏడునెలలోనే తొమ్మిది ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చిందని ఆరోపించింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement