సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు, పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ విశ్రాంత డీఎఫ్‌వో రామన్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు.. మూడు వారాల్లో ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
పరీక్షల వాయిదా నిరాకరించిన హైకోర్టు..
పీజీ మెడికల్, దంత పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. రేపటి నుంచి యథాతథంగా పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది. పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయినా రెగ్యులర్‌గా గుర్తిస్తామని హైకోర్టుకు కాళోజీ యూనివర్శిటీ తెలిపింది. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment