జల్లికట్టుకు బ్రేక్‌.. ఆపింది తమిళ తంబీలే | jallikattu commence halted by students cm Panneerselvam will meet them | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 22 2017 11:51 AM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM

తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మళ్లీ బ్రేక్‌ పడింది. మూడేళ్ల నిషేధపు కట్టు తెంచుకొని పూర్వవైభవంతో సందడి మొదలవుతుందనుకున్న వేళ మరోసారి అంతరాయం ఏర్పడింది. అయితే, ఈసారి అడ్డుకుంది మాత్రం తమిళ తంబీలే. జల్లికట్టు తమిళుల సంప్రదాయ క్రీడ అనే విషయం తెలిసిందే. మూగజీవాలను ఈ ఆట పేరుతో వేధిస్తున్నారని పెటా కోర్టుకు ఇంకొన్ని స్వచ్ఛంద సంస్థలు కోర్టుకు వెళ్లడంతో గత మూడేళ్లుగా ఈ క్రీడపై నిషేధం కొనసాగుతోంది. దీంతో ఈసారి తమిళులలంతా ఒక్కటై తమ సంప్రదాయ క్రీడకు అడ్డుచెప్పొద్దని నినదిస్తూ గత నాలుగు రోజులుగా రాష్ట్రమంతటా ఆందోళనలు చేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement